విమానంలో 267 మంది ప్రయాణికులు.. టేకాఫ్‍కు ముందు పైలట్ అరెస్ట్..
యునైటెడ్ ఎయిర్ లైన్స్ కు చెందిన విమానం పారిస్ నుంచి వాషింగ్టన్ డీసీకి వెల్లడానికి సిద్ధంగా ఉంది. విమానంలో 267 మంది ప్రయాణికులు ఎక్కారు. కాసేపట్లో విమానం టేకాఫ్ అవుతుందనగా.. పోలీసులు పైలట్ అరెస్ట్ చేశారు. దీంతో ఆ విమానం రద్దు అయింది. పైలట్ పోలీసులు ఎందుకు అరెస్ట్ చేశారు.. విమానం ఎందుకు రద్దు అయిందో తెలుసుకుందాం పదండి..
యుఎస్ కు చెందిన పైలట్ ఆదివారం 267 మంది ప్రయాణికులతో పారిస్‌లోని చార్లెస్ డి గల్లె విమానాశ్రయం నుంచి వర్జీనియాలోని వాషింగ్టన్ డల్లెస్ విమానాశ్రయానికి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నాడు. అయితే, అతను వచ్చినప్పుడు పైలట్ కళ్ల ఎర్రడినట్లు. తూలుతున్నట్లు కనిపించాడు. మాట్లాడుతుంటే తడబడ్డాడు. దీని గమనించిన భద్రత సిబ్బంది పైలట్ కు డ్రంక్ టెస్ట్ చేశారు. అతను తాగాల్సిన మొతాదు కంటే ఎక్కువ తాగినట్లు పరీక్షలో నిర్ధారణ అయిందని న్యూయార్క్ పోస్ట్ నివేదించింది.

పైలట్ శరీరంలో 0.59mg/l, 0.56mg/l ఆల్కహాల్ ఉన్నట్లు వెల్లడైంది. ఇది ఫ్రాన్స్‌లోని విమాన సిబ్బందికి ఆరు రెట్లు ఎక్కువ. టేకాఫ్‌కు ఒక గంట ముందు అతన్ని అరెస్టు చేశారు. దింతో చివరి నిమిషంలో విమానాన్ని రద్దు చేయాల్సి వచ్చింది. దీనపై పైలట్‌ని ప్రశ్నించగా.. తాను ముందురోజు రాత్రి కేవలం రెండు గ్లాసుల వైన్ మాత్రమే తాగానని కోర్టుకు తెలిపాడు. అయితే న్యాయమూర్తి అతని మాటలపై అనుమానం వ్యక్తం చేశారు. " ఒక వేళ విమాన ప్రమాదం జరిగి ఉంటే 267 మంది ప్రయాణికులను ప్రమాదంలో పడేవారని" అని కోర్టు అభిప్రాయపడింది.
కోర్టు పైలట్‌ను ఆరు నెలల సస్పెండ్ చేయడంతో జైలు శిక్ష, దాదాపు $5,000 జరిమానా విధించింది. "మా కస్టమర్‌లు, సిబ్బంది భద్రత ఎల్లప్పుడూ మా మొదటి ప్రాధాన్యత. మేము మా ఉద్యోగులందరినీ అత్యున్నత ప్రమాణాలకు అనుగుణంగా ఉంచుతాము. మద్యం పట్ల కఠినమైన నో టాలరెన్స్ విధానాన్ని కలిగి ఉన్నాము" అని యునైటెడ్ ఎయిర్‌లైన్స్ ప్రతినిధి ఒక ప్రకటనలో తెలిపారు. "ఈ ఉద్యోగిని తక్షణమే సేవ నుంచి తొలగించారు. మేము స్థానిక అధికారులకు పూర్తిగా సహకరిస్తున్నాము" అని వారు తెలిపారు.
గత నెలలో ఇలాంటి ఘటనే జరిగింది. పైలట్ మద్యం సేవించడంతో అతన్ని అరెస్టు చేశారు. దీంతో స్కాట్లాండ్‌లోని ఎడిన్‌బర్గ్ నుంచి న్యూయార్క్ నగరానికి వెళ్లాల్సిన డెల్టా ఎయిర్‌లైన్స్ విమానం రద్దు చేశారు. బోయింగ్ 767 టేకాఫ్ కావడానికి కేవలం 30 నిమిషాల ముందు 61 ఏళ్ల పైలట్‌ను ఉదయం 10 గంటలకు ఎడిన్‌బర్గ్ విమానాశ్రయంలో అరెస్టు చేశారు.












Click it and Unblock the Notifications