హెలికాప్టర్ కుప్పకూలి సౌదీ యువరాజుతో సహ 8 మంది దుర్మరణం, ప్రమాదానికి కారణం!

రియాద్: అభివృద్ది పనులు పర్యవేక్షించడానికి బయలుదేరి వెళ్లిన సౌదీ అరేబియా యువరాజు హెలికాప్టర్ కుప్పకూలడంతో దుర్మరణం చెందాడు. సౌదీ యువరాజుతో సహ 8 మంది అధికారులు మరణించారని సౌదీ మీడియా సోమవారం తెలిపింది. సౌదీ యువరాజు మన్ సౌర్ బిన్ ముక్రిన్ మరణించాడు.

సౌదీ అరేబియాలోని ఆసిర్ ప్రాంతం డిప్యూటీ గవర్నర్ గా యువరాజు మన్ సౌర్ బిన్ ముక్రిన్ విధులు నిర్విహిస్తున్నారు. ఆసిర్ ప్రాంతంలో జరుగుతున్న వివిధ అభివృద్ది పనులను పర్యవేక్షించడానికి యువరాజు మన్ సౌర్ బిన్ ముక్రిన్ వెళ్లారు. అభివృద్ది పనులు పర్యవేక్షించి తిరిగి హెలికాప్టర్ లో మరో ప్రాంతానికి బయలుదేరారు.

A Saudi prince Mansour bin Muqrin killed in helicopter crash

మార్గం మధ్యలో సౌదీ అరేబియా - యమన్ సరిహద్దులో వెలుతున్న హెలికాప్టర్ ఒక్క సారిగా కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో సౌదీ యువరాజు మన్ సౌర్ బిన్ ముక్రిన్ తో పాటు ఆయన వెంట ఉన్న 8 మంది అధికారులు దుర్మరణం చెందారు. హెలికాప్టర్ కుప్పకూలడానికి కచ్చితమైన కారణాలు తెలియడం లేదని స్థానిక అధికారులు అంటున్నారు. 2015 నుంచి మన్ సౌర్ బిన్ ముక్రిన్ డిప్యూటీ గవర్నర్ గా ప్రజలకు సేవ చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+