సరస్సు అడుగున బయటపడిన గ్రామం

దశాబ్దాల క్రితం నీటిలో మునిగిపోయిన ఒక గ్రామం ఆనవాళ్లు ఇప్పుడు బయటపడ్డాయి.
ఇటలీలోని ఒక రిజర్వాయర్ అడుగున ఇవి కనిపించాయి. ఉత్తరాన ఉండే రేసియా సరస్సు, దాని మధ్యలో ఉండే చర్చి టవర్ చూడ్డానికి చాలా అందంగా ఉంటాయి.
ఆ పరిసరాలు కూడా చాలా ఆహ్లాదకరంగా ఉంటాయి. ఒక పుస్తకం రాసేందుకు, నెట్‌ఫ్లిక్స్‌లో ఒక సిరీస్‌ను నిర్మించేందుకు కూడా ఈ సుందర దృశ్యం ప్రేరణగా నిలిచింది.
- భారతదేశంలోని 'అస్థిపంజరాల సరస్సు’.. అంతు చిక్కని రహస్యాల నిలయం
- కొల్లేరు: దేశంలో అతి పెద్ద మంచినీటి సరస్సుకు వచ్చిన ప్రమాదం ఏమిటి? పరిష్కారం ఎలా?

గ్రామం ఆనవాళ్లు ఎలా బయటపడ్డాయి?
రిజర్వాయర్ మరమ్మత్తుల కోసం సరస్సులోని నీటిని వదిలేయడంతో క్యురన్ అనే గ్రామం ఆనవాళ్లు కనిపించాయి.
ఒకప్పుడు ఈ గ్రామంలో వందలాది మంది నివసించేవారు.
1950లో హైడ్రోఎలక్ట్రిక్ ప్లాంట్‌ను నిర్మించడం వల్ల వరద నీరు చేరి క్యురన్ గ్రామం నీట మునిగింది.
- 35 సంవత్సరాల క్రితం అదృశ్యమైన విమానం జాడ ఇప్పుడు దొరికింది
- అంగారకుడిపై నీటి సరస్సు: మరి అక్కడ జీవం ఉందా? లేదా?

సరస్సు అడుగున ఉన్న 14వ శతాబ్దానికి చెందిన చర్చి టవర్‌తో పాటు గోడలు, సెల్లార్లు, మెట్ల ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ అయ్యాయి.
ఒకప్పటి గ్రామం నడిబొడ్డున నడుస్తున్నప్పుడు 'వింత అనుభూతి' కలిగిందని లూసియా అజోలినీ అనే వ్యక్తి ట్వీట్ చేశారు.
- ఈజిప్ట్‌లో బయటపడిన 3000 ఏళ్ల నాటి పురాతన 'బంగారు నగరం’
- సింధు నాగరికత ప్రజలు గొడ్డు మాంసం తినేవారా? వారు వాడిన మట్టి కుండలు చెప్తున్న రహస్యాలేమిటి?

1950లో ఒక రిజర్వాయర్‌ను నిర్మించాలని, దగ్గర్లోని రెండు సరస్సులను కలపాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దాంతో ప్రజలకు ఇష్టం లేకపోయినా క్యురన్ గ్రామం నీట మునగాల్సిన పరిస్థితి వచ్చింది.దాదాపు 160 ఇళ్లు నీట మునిగాయి. క్యురన్ ప్రజలు నిర్వాసితులయ్యారు. కొందరు కొత్తగా నిర్మించిన గ్రామంలో స్ధిరపడ్డారు.

రేసియా లేదా జర్మన్లో రెస్చెన్సీ అని పిలిచే ఈ సరస్సు ఆస్ట్రియా, స్విట్జర్లాండ్ సరిహద్దుల్లో పర్వత ప్రాంతంలోని దక్షిణ టైరోల్‌లో ఉంది.
ప్రస్తుతం వేసవి కాలంలో సరస్సు వద్దకు హైకర్స్ వస్తుంటారు.
చలికాలంలో యాత్రికులు గడ్డ కట్టిన సరస్సుపై నడుస్తూ శిఖరాన్ని చేరుకుంటారు.
ఇవి కూడా చదవండి
- ఇంటి పెరట్లో బావి తవ్వుతుండగా రూ.745 కోట్ల విలువైన నీలమణులు దొరికాయి
- అందం కోసం సెక్స్ ఒప్పందాలు: 'నాకు కాస్మోటిక్ సర్జరీ చేయిస్తే నా శరీరం ఆరు నెలలు నీదే’
- 1778 తర్వాత అదృశ్యమైంది, 235 సంవత్సరాలు గడిచాక సముద్రం అడుగున కనిపించింది
- 'జీన్స్ వేసుకుని పూజలో పాల్గొందని కొట్టి చంపేశారు'
- మగవాళ్లకు సంతాన నిరోధక మాత్రలు ఎందుకు లేవు? సైన్స్ ఏం చెబుతోంది
- వెక్కిళ్లు ఎందుకొస్తాయి? ఆగాలంటే ఏం చేయాలి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)












Click it and Unblock the Notifications