డొనాల్డ్ ట్రంప్‌తో ఎఫైర్... ఆ 90 సెకన్లు నా జీవితంలోనే అత్యంత చెత్త.. : పోర్న్ స్టార్ డేనియల్స్

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌‌పై గతంలో పలువురు మోడల్స్,మహిళలు లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. చాలామంది మోడల్స్‌తో ఆయన లైంగిక సంబంధాలు నెరిపినట్లు గతంలో ఎన్నో కథనాలు వచ్చాయి. అమెరికా అధ్యక్ష పదవిని చేపట్టడానికి ముందు పోర్న్ స్టార్ స్టోమీ డేనియల్స్‌తోనూ ఆయన రాసలీలలు సాగించారు. అయితే అప్పట్లో ఈ వ్యవహారం బయటపడకుండా ఉండేందుకు ట్రంప్ లాయర్ మైకెల్ కోహెన్ ఆమెకు భారీ మొత్తంలో డబ్బు ముట్టజెప్పారు. అదే కోహెన్ తాజాగా స్టోమీ డేనియల్స్‌కు క్షమాపణలు చెప్పడం గమనార్హం.

డేనియల్స్‌ను ఇంటర్వ్యూ చేసిన కోహెన్

డేనియల్స్‌ను ఇంటర్వ్యూ చేసిన కోహెన్

మైకెల్ కోహెన్ నిర్వహిస్తున్న 'Mea Culpa' అనే పాడ్‌కాస్ట్ టాక్‌ షోకి ఇటీవల స్టోమీ డేనియల్‌ను ఆయన అతిథిగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా డేనియల్స్‌ను ఇంటర్వ్యూ చేసిన కోహెన్... గతంలో తనవల్ల ఆమె ఎదుర్కొన్న ఇబ్బందులకు క్షమాపణ చెప్తున్నట్లు వెల్లడించారు. కోహెన్ వ్యాఖ్యలపై స్పందించిన డేనియల్స్.. 'మనిద్దరి కథలు ఎప్పుడూ ట్రంప్‌తో ముడిపడే ఉంటాయి... అలాగే ఒకరితో ఒకరివి...' అని పేర్కొన్నారు.

ఆ 90 సెకన్లు అత్యంత చెత్త...

ఆ 90 సెకన్లు అత్యంత చెత్త...

ఇదే టాక్ షోలో ట్రంప్‌తో డేనియల్స్‌కు ఎదురైన చేదు అనుభవంపై ఇద్దరూ చర్చించారు. 'ట్రంప్‌ నుంచి తాను భౌతిక హాని ఎదుర్కోలేదని... అయితే ఆయన తనను చాలా అసౌకర్యానికి గురిచేశారని చెప్పారు. అందువల్లే ఆయనతో పడకను పంచుకునేందుకు ఇష్టపడలేదన్నారు. 2006లో ట్రంప్‌తో పడక గదిలో గడిపిన సందర్భాలను గుర్తుచేసుకుంటూ... తన జీవితంలోనే ఆ 90 సెకన్ల కాలం అత్యంత చెత్త అని అభిప్రాయపడ్డారు. ఆ ఘటనతో తనపై తనకే విరక్తి,ద్వేషం పుట్టిందన్నారు.

ఇదే వ్యవహారంలో జైలుకు కోహెన్...

ఇదే వ్యవహారంలో జైలుకు కోహెన్...

2016లో ట్రంప్ అధ్యక్ష పీఠం చేపట్టగా... అంతకు పదేళ్ల క్రితం 2006లో డేనియల్స్‌తో ఆయన సంబంధం కొనసాగించారన్న ప్రచారం ఉంది. ట్రంప్ భార్య మెలానియా బారోన్‌కు జన్మనిచ్చిన తర్వాత.. ఆయన డేనియల్స్‌తో కొద్ది నెలలు రాసలీలలు నెరిపారని గతంలో అమెరికా మీడియాలోనే చాలా కథనాలు వచ్చాయి. ట్రంప్ అధ్యక్ష పీఠాన్ని చేపట్టే సమయంలో డేనియల్స్ ఈ వ్యవహారాన్ని తెర పైకి తీసుకురాకుండా కోహెన్ ఆమెకు 130,000 అమెరికన్ డాలర్లను చెల్లించారన్న ఆరోపణలున్నాయి. ఈ ఆరోపణలు నిజమని తేలడంతో కోహెన్ జైలు శిక్ష కూడా అనుభవించారు. డేనియల్స్‌ను మాత్రమే కాదు,మరో ప్లే బాయ్ మోడల్ కరెన్ మెక్‌దౌగల్‌ను కూడా కోహెల్‌ ఇలాగే డబ్బులతో మేనేజ్ చేశారన్న ఆరోపణలున్నాయి. ఈ ఇద్దరి విషయంలో తాను చాలా పశ్చాత్తపడుతున్నట్లు తాజా ఇంటర్వ్యూలో కోహెన్ పేర్కొన్నాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+