టెర్రర్ అటాక్: ఆప్ఘనిస్థాన్‌లో 40 మంది పోలీసులు మృతి
కాబూల్: ఆప్ఘనిస్థాన్‌లో తాలిబన్లు మరోసారి రెచ్చిపోయారు. రాజధాని కాబూల్‌లో ఉగ్రవాదులు జరిపిన ఆత్మాహుతి దాడిలో 40 మంది పోలీసులు చనిపోగా 100 మందికి పైగా గాయపడ్డారు. వివరాల్లోకి వెళితే గురువారం ఉగ్రవాదులు ఆప్ఘనిస్థాన్ రాజధాని కాబూల్‌లో మిలిటరీ వాహన శ్రేణిని లక్ష్యంగా చేసుకుని మూడు సూసైడ్ బాంబర్లు తనను తాను పేల్చుకున్నారు.
కాబూల్‌లోని పశ్చిమ ప్రాంతమైన పాగ్మన్ జిల్లాకు ఈ మిలిటర్ కాన్వాయ్ వెళుతుండగా ఈ సంఘటన చోటు చేసుకుంది. ఈ ఆత్మాహుతి దాడిలో గాయపడిన వారిని వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. దాడి ఘటనపై స్పందించిన గవర్నర్ హజీ మహమ్మద్ ముసా ఖాన్ మృతుల సంఖ్య మరితంగా పెరిగే అవాకశం ఉందన్నారు.

అంతర్జాతీయ ఉగ్రవాద సంస్ధ ఐసిస్ టర్కీ రాజధాని ఇస్తాంబుల్‌లోని విమానాశ్రయంలో ఉగ్రదాడికి పాల్పడి 100మందికి పైగా ప్రాణాలను బలిగొన్న మరుసటి రోజునే ఈ దాడి జరగడం విశేషం. కాగా, ఈ ఉగ్రదాడికి పాల్పడింది తామేనని తాలిబన్ సంస్ధ ప్రకటించుకుంది. ఈ నెలలో ఇప్పటి వరకు 64 మంది చనిపోయారు.
తాలిబన్ అధినేత ముల్లా అక్తర్ మన్సూర్ చనిపోయిన తర్వాత ఆప్ఘనిస్థాన్ ఆర్మీపై ఉగ్రవాద సంస్ధ తాలిబన్ దాడులను మరింత తీవ్రతరం చేసింది. ఈ నెలలో ఆప్ఘనిస్థాన్ మిలిటరీపై జరిగిన రెండో అతిపెద్ద దాడిగా దీనిని అభివర్ణిస్తున్నారు. జూన్ 21న ఓ బస్సుపై దాడి చేసిన ఉగ్రవాదులు 12 మంది నేపాలీలతో పాటు ఇద్దరు భారతీయలను పొట్టన బెట్టుకున్నారు.
Update: Suicide bomber targeted the bus carrying police from #Wardak province to #Kabul: Afghan Media
— ANI (@ANI_news) June 30, 2016
-
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
పవన్ కళ్యాణ్‌ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు












Click it and Unblock the Notifications