వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎయిర్ ఏషియాకు మరో దెబ్బ: టేకాఫ్‌కి ముందే పాడైన ఇంజిన్

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

జకార్తా: ఎయిర్ ఏషియా విమానాలకు కాలం కలిసి రావడం లేదు. తమ విమానాలు ప్రమాదాలు చోటు చేసుకోవు అంటూ సంస్ధ సీఈఓ ప్రకటించిన రెండు నెలల్లోనే జావా సముద్ర జలాల్లో క్యూజెడ్ 8501 విమానం కూలిపోయింది. కూలిన సమయంలో విమానంలో ప్రయాణికులు, విమాన సిబ్బంది కలిపి 162 మంది ఉన్నారు.

పాఠకుల కోసం ఫేస్‌బుక్ ద్వారా ఎప్పటికప్పుడు తాజా వార్తలు... లైక్ చేయండి.

ఎయిర్ ఆసియా విమానం కూలిన ఘటనలో సెర్చ్ ఆపరేషన్‌ను వేగవంతం చేశారు. మరో ఏడు శవాలను వెలికి తీశారు. దీంతో మొత్తం 16 శవాలను ఇప్పటి వరకు వెలికితీసినట్లయింది. శకలాలను కూడా వెలికి తీశారు. సముద్రం అడుగు నుంచి శకలాలను వెలికి తీసే కార్యక్రమం నడుస్తోంది. విమానం బ్లాక్ బాక్సుల సిగ్నల్స్‌ను కనుక్కోవడానికి ఫ్రెంచ్, సింగపూర్ దర్యాప్తు అధికారులు ప్రయత్నాలు సాగిస్తున్నారు.

Air Asia plane engine dies just before takeoff from Surabaya, passengers told to disembark

ఆ సంఘటన నుంచి తేరుకోక ముందే మరో విమానాన్ని ఆదివారం నాడు సురబయ జవాందా ఎయిర్ పోర్టు నుంచి టేకాఫ్ చేస్తుండగా ఒక ఇంజిన్ పనిచేయడం మానేసింది. ఇంజిన్ నుంచి ఒక్కసారిగా పెద్ద ఎత్తున శబ్దాలు రావడంతో విమానాన్ని తిరిగి రన్ వేపై ల్యాండ్ చేశారు.

విమానంలో ఉన్న 120 మంది ప్రయాణికులను దింపి మరమత్తులు నిర్వహించారు. అనంతరం ఒక ట్రయల్ రన్ నిర్వహించి ప్రయాణీకులను తిరిగి విమానంలోకి ఎక్కమని చెప్పగా, 90 శాతం మంది నిరాకరించారు. ఆ విమానంలో తాము ప్రయాణంచలేమని స్పష్టం చేశారు. ఈ విమానం శనివారం రాత్రి 9 గంటలకు బయలుదేరాల్సి ఉంది. దీంతో ఎవరైతే ప్రయాణీకులు ప్రయాణానికి సుముఖంగా లేరో వారి విమాన ఛార్జీలను ఎయిర్ ఏషియా తిరిగి చెల్లించింది.

English summary
In the latest incident to hit an AirAsia flight departing from Surabaya, the engine of a plane failed just before it took off from Juanda International Airport in the Indonesian city, local news media reported.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X