ఉక్రెయిన్‌లో ఘోర విమాన ప్రమాదం: 180 మంది దుర్మరణం.. ఏ ఒక్కరూ ప్రాణాలతో మిగలకుండా (వీడియో)

Recommended Video

    180 మందీ దుర్మరణం: ఉక్రెయిన్ విమాన ప్రమాద వీడియో..!

    టెహ్రాన్: ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లో బుధవారం అర్ధరాత్రి దాటిన తరువాత చోటు చేసుకున్న విమాన ప్రమాదంలో ఏ ఒక్కరూ ప్రాణాలతో మిగల్లేదు. ప్రయాణికులు, విమాన సిబ్బంది మొత్తం దుర్మరణం పాలైనట్లు అధికారులు వెల్లడించారు. టెహ్రాన్ అంతర్జాతీయ విమానాశ్రయం సీనియర్ ప్రజా సంబంధాల అధికారి అలి ఖాషానీ ఓ అధికారి ప్రకటనను విడుదల చేశారు. విమాన ప్రమాదంలో 170 మంది దుర్మరణం పాలైనట్లు పేర్కొన్నారు.

    ఉక్రెయిన్‌కు చెందిన ఇంటర్నేషనల్ ఎయిర్ లైన్స్ ఫ్లైట్ పీఎస్ 752 ఈ తెల్లవారు జామున టెహ్రాన్‌లో ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. టెహ్రాన్‌లోని ఇమాన్ ఖొమేనీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఉక్రెయిన్ రాజధాని కీవ్‌కు 170 మంది ప్రయాణికులు, సిబ్బందితో బయలుదేరిన ఈ విమానం టేకాఫ్ తీసుకున్న కొద్ది సేపటికే కుప్పకూలిపోయింది. టెహ్రాన్ ప్రావిన్స్‌ రొబట్ కరీమ్ కంట్రీ సమీపంలో గల పరండ్‌ సిటీ శివార్లలో నిప్పులు కక్కుకుంటూ నేలరాలింది.

     All 170 passengers and crew onboard a Ukranian airplane have been killed

    ఇరాక్‌లోని అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ క్షిపణులతో దాడి చేసిన కొద్దిసేపటికే ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సాకేంతిక కారణాల వల్లే విమానం ప్రమాదానికి గురైనట్లు అధికారులు నిర్ధారించారు. విమానం కుప్పకూలిన వెంటనే ఇరాన్ భద్రతా సిబ్బంది, పోలీసులు, అగ్నిమాపక బలగాలు సంఘటన స్థలానికి చేరుకున్నాయి. సహాయక చర్యల్లో నిమగ్నమయ్యాయి. ఎవరైనా జీవించి ఉండే అవకాశం ఉండొచ్చనే అనుమానంతో సంఘటన స్థలాన్ని జల్లెడ పట్టాయి.

    ఎవ్వరూ ప్రాణాలతో మిగల్లేదు. దీనితో ఈ విషయాన్ని అధికారికంగా ధృవీకరించారు. తొలుత 180 మంది మరణించినట్లు వార్తలు వచ్చాయి. వాటిని అధికారులు తోసిపుచ్చారు. ప్రమాద సమయంలో విమానంలో 170 మంది ప్రయాణికులు, సిబ్బంది ఉన్నారని నిర్ధారించినట్లు ఇరాన్ పౌర విమానయాన శాఖ అధికార ప్రతినిధి రెజా జఫర్ జదె తెలిపారు. ప్రమాద ఘటనపై ఉక్రెయిన్ ప్రభుత్వానికి అధికారికంగా సమాచారాన్ని ఇచ్చామని చెప్పారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+