హిల్లరీ నా జీవితం, నా ప్రాణం: బిల్ క్లింటన్
వాషింగ్టన్: అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ తన భార్య హిల్లరీ క్లింటన్ ను ఆకాశానికి ఎత్తివేశాడు. ఆమె తన ఎదుగుదలకు సహకరించిందని, కష్టాలలో ఉన్న సమయంలో వెన్నంటి ఉన్నదని చెప్పారు. ఓ టీవీ చానెల్ ఇంటర్వూలో బిల్ క్లింటన్ తన మనస్సులోని మాటలను బయటకు చెప్పారు.
40 సంవత్సరాల తమ వైవాహిక జీవితంలో హిల్లరీ ఎప్పుడు తనకు అండగా ఉన్నారని, తన వెంటే ఉంటూ ఎప్పటికప్పుడు అన్ని విధాల సహకరించిందని బిల్ క్లింటన్ చెప్పారు. అంతే కాకుండా తన ఎదుగుదలలో ఎంతగానో సహాయపడిందని అన్నారు.

తను కష్టాలలో ఉన్న సమయంలో హిల్లరీ కుటుంబ పెద్దగా నిలబడుతూ తనుకు అన్ని విధాల ధైర్యం చెప్పిందని, ఆమె కంటే తనకు ప్రపంచంలో ఏది ఎక్కవ కాదని బిల్ క్లింటన్ అన్నారు. హిల్లరీని కాదని తాను ఏ కార్యక్రమం చెయ్యలేదని, పాల్గోనలేదని వివరించారు.
కొన్ని సందర్బాలలో హిల్లరీ తన మీద తీసుకున్న జాగ్రతలు జీవితంలో మరిచిపోలేనివని అంటున్నారు. తామిద్దరు ఒకరి అభిప్రాయాలను ఒకరు గౌరవించుకుంటున్నామని, అందుకే జీవితం సాఫీగా సాగిపోతున్నది చెప్పారు. హిల్లరీ అమెరికా అధ్యక్ష పదవికి పోటిపడుతున్నారు. ఆమె నిర్వహించే ప్రచార ర్యాలీలో బిల్ క్లింటన్ పాల్గోంటారని తెలిసింది.












Click it and Unblock the Notifications