వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇప్పుడు బీర్ వంతు.. ఇదివరకు ఫ్రీ సెక్స్... టీకా కోసం అగ్రరాజ్యం అమెరికా ఆఫర్లు

|
Google Oneindia TeluguNews

కరోనా మహమ్మారిని సమూలంగా పారదోలాలంటే టీకా కంపల్సరీ. దీంతో ప్రజలకు వ్యాక్సిన్ వేయించేపనిలో దేశాలు నిమగ్నం అయ్యాయి. ఇందుకు అగ్రరాజ్యం అమెరికా ఎప్పుడు ముందు ఉంటుంది. ఇదివరకు ఫ్రీ సెక్స్ అని బంపర్ ఆపర్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఫ్రీ బీర్ అంటూ నోరూ ఊరించే ఆఫర్ ఇచ్చింది. ప్రజలంతా వ్యాక్సిన్ తీసుకునేలా చర్యలు తీసుకుంటుంది.

టీకా తీసుకోండి..

టీకా తీసుకోండి..

పెద్దలంతా టీకా వేసుకునేలా ప్రోత్సహించేందుకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ పలు చర్యలు చేపడుతున్నారు. మరో నెలలో అమెరికా ప్రజలు స్వాంత్ర దినోత్సవం జరుపుకోనున్న తరుణంలో అప్పటికల్లా దేశంలోని పెద్దల్లో 70 శాతం మందికి కనీసం ఒక్క డోసు టీకా అయినా అందాలని లక్ష్యం పెట్టుకున్నారు. జూన్ నెలను 'ప్రత్యక్ష కార్యాచరణ మాసంగా' ప్రకటిస్తూ..పెద్దలందరూ టీకా వేసుకోవాలని వివిధ వేదికల ద్వారా పిలుపునిస్తున్నారు.

ఆఫర్..

ఆఫర్..

ప్రముఖ బీర్ కంపెనీ ఆన్హైసర్ బుష్.. అమెరికా ప్రజలు టీకా తీసుకునేలా ప్రోత్సహించేందుకు మరో తాయిలం ప్రకటించింది. అధ్యక్షుడు విధించిన లక్ష్యాన్ని ప్రజలు జులై 4 కల్లా సాధిస్తే పెద్దలందరికీ ఉచితంగా ఓ బీర్ అందిస్తామని ప్రకటించింది. కరోనా నుంచి కోలుకుంటున్న అమెరికాకు తామూ పూర్తి స్థాయిలో మద్దతిస్తామని కంపెనీ సీఈఓ వెల్లడించారు.

తాయిలాలు

తాయిలాలు

టీకా పంపిణీ చేపట్టి దేశాన్ని కరోనా పూర్వ స్థితికి చేర్చాలని బైడెన్ అనేక చర్యలు చేపడుతున్నారు. ప్రజలు టీకా వేయించుకునేలా ప్రోత్సహించేందుకు బైడెన్ ప్రభుత్వం ఇప్పటికే పలు తాయిలాలను ప్రకటించింది. నగదు బహుమతులు, జీతంతో కూడిన సెలవుల మంజురు, స్పోర్ట్స్ టోర్నమెంట్లకు టిక్కెట్లు ఇవ్వడం వంటి అనేక ప్రోత్సాహాకాలు ఇచ్చింది. ప్రస్తుతం ఉచిత బీర్ తాయిలం ప్రజల ముందుకు వచ్చింది.

63 శాతం మంది..

63 శాతం మంది..

తాజా లెక్కల ప్రకారం..అమెరికాలోని పెద్దల్లో ఇప్పటివరకూ దాదాపు 63 శాతం మంది కనీసం ఒక్క డోసును పొందారు. 133.6 మిలియన్ల మందికి పూర్తి స్థాయిలో(రెండు డోసులు) టీకాలు అందాయి. ప్రస్తుతం అక్కడ రోజుకు 6 లక్షల టీకా డోసులను ఇస్తున్నారు.

English summary
america president joe biden offers free beer to get americans vaccinated against covid-19.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X