ట్రంప్‌తో.. నిక్కీ హేలీకి అఫైర్!? ‘ఫైర్ అండ్ ఫ్యూరీ’తో వెలుగులోకి.. ఖండించిన హేలీ

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ గురించి మరో వదంతి గుప్పుమంది. ఐక్యరాజ్య సమితిలో ఆ దేశ రాయబారి నిక్కీ హేలీ(46)తో ట్రంప్ అఫైర్ కొనసాగిస్తున్నట్లు వదంతులు వినిపిస్తున్నాయి.

వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ గురించి మరో వదంతి గుప్పుమంది. ఐక్యరాజ్య సమితిలో ఆ దేశ రాయబారి నిక్కీ హేలీ(46)తో ట్రంప్ అఫైర్ కొనసాగిస్తున్నట్లు వదంతులు వినిపిస్తున్నాయి.

ట్రంప్ తన ఎయిర్‌ఫోర్స్ వన్ విమానంలో హేలీతో చాలాసేపు గడుపుతున్నారట. అయితే ఈ వదంతులను నిక్కీ హేలీ తీవ్రంగా ఖండించారు. విజయవంతమైన ఓ మహిళపై ఇలాంటి వదంతులు పుట్టుకురావడం అసహ్యకరమని ఆమె వ్యాఖ్యానించారు.

trump-nikky-haley

ఇంతకీ ఈ వదంతి ఎలా పుట్టుకొచ్చిందంటే.. ఇటీవల శ్వేతసౌధంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యవహార తీరుపై రచయిత ఓ పుస్తకం రాశారు. 'ఫైర్ అండ్ ప్యూరీ' పేరుతో విడుదలైన ఈ పుస్తకం అమెరికాలో సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు.

ఈ పుస్తకంలోనే ట్రంప్, నిక్కీ హేలీల మద్య ఉన్న సంబంధం గురించి కూడా రచయితన మైఖేల్ వుల్ఫ్ ప్రస్తావించారు. అయితే నిక్కీ హేలీ మాత్రం ఈ వ్యాఖ్యలను తీవ్ర స్థాయిలో ఖండించింది. తానెప్పుడూ అధ్యక్షుడు ట్రంప్‌తో తన భవిష్యత్తు గురించి చర్చించలేదనీ, ఆయనతో ఒంటరిగా గడపనేలేదని ఆమె స్పష్టం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+