Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Earthquake: 7.7 తీవ్రతతో వణికిన తీరం : సునామీ అలర్ట్: రోడ్లపై జనం పడిగాపులు..!!

మెక్సికో సిటీ: మెక్సికోలో పెను భూకంపం సంభవించింది. మెక్సికో పశ్చిమం-ఆగ్నేయ దిశలో సంభవించిన ఈ భూకంప తీవ్రత భారీగా ఉంటోంది. పలు భవనాలు కంపించాయి. బీటలు వారాయి. కొన్ని చోట్ల భవనాలు ధ్వంసం అయ్యాయి. వాటి శిథిలాల కింద చిక్కుకుని ఒకరు మరణించారు. తీర ప్రాంతం కావడం వల్ల సునామీ అలర్ట్‌ను జారీ చేశారు అధికారులు. ప్రధాన భూకంపం తరువాత కూడా పలుమార్లు భూమి స్వల్పంగా ప్రకంపించింది. దీనితో ప్రజలు తీవ్ర భయభ్రాంతులకు గురయ్యారు. రోడ్ల మీదికి పరుగులు తీశారు.

మెక్సికో పశ్చిమతీరంలోని కోలిమా వద్ద 15కిలోమీటర్ల లోతులో భూకంపం వచ్చిందని యూఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది. స్థానిక కాలమానం ప్రకారం 1:05 నిమిషాలకు భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 7.7గా రికార్డయింది. మిచోకాన్ స్టేట్ సరిహద్దుల్లోని పశ్చిమతీరంలోని కోలిమా ఆగ్నేయ దిశగా 15 కిలోమీటర్లు, కోల్‌కమాన్‌కు 59 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రాంతాన్ని భూకంప కేంద్రంగా గుర్తించింది యూఎస్‌జీఎస్.

 An earthquake of magnitude 7.7 has hit Mexicos Pacific coast

ఉపరితలం నుంచి మూడు కిలోమీటర్ల లోతున ఫలకాల్లో మార్పుల వల్ల భూకంపం సంభవించినట్లు యూఎస్‌జీఎస్ తెలిపింది. ఆ తరువాత కూడా స్వల్పంగా పలుమార్లు భూమి కంపించినట్లు మెక్సికో నేషనల్ సెస్మాలాజికల్ ఏజెన్సీ వెల్లడించింది. మిచోకాన్ స్టేట్ తీర ప్రాంతంలో ఉండటం వల్ల సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయి. యూఎస్ సునామీ వార్నింగ్ సెంటర్ దీన్ని జారీ చేసింది. 200 చదరపు కిలోమీటర్ల ప్రాంతం మేర దీని ప్రభావం ఉంటుందని హెచ్చరించింది.

భూకంప తీవ్రతకు మన్జనిల్లోలో పలు భవనాలు ధ్వంసం అయ్యాయి. కొన్ని కుప్పకూలిపోయాయి. వాటి శిథిలాల మధ్య పలు చిక్కుకుపోయారు. వారిలో ఒకరు మరణించినట్లు సమాచారం అందింది. ప్రాణనష్టాన్ని తగ్గించడానికి యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకున్నామని మెక్సికో అధ్యక్షుడు ఆండ్రీస్ మాన్యుయెల్ లోపెజ్ తెలిపారు. రాజధాని మెక్సికో సిటీపై భూకంప ప్రభావం పడలేదని అన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+