10వ బిడ్డకు జన్మనిచ్చిన 66 ఏళ్ల బామ్మ.. వైద్యరంగంలో చర్చ
పాతికేళ్లకే సంతాన సమస్యలతో బాధపడుతున్న ఈ రోజుల్లో ఈ బామ్మ అద్భుతమే చేసింది. 66 ఏళ్ల వయసులో ఆమె తల్లి అయింది. పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఇది ఆమెకు 10 వ సంతానం కావడం విశేషం. ఎలాంటి ఐవీఎఫ్.. ఇతర సాంకేతికత లేకుండానే ఆమె సాధారణ పద్ధతిలోనే గర్భం దాల్చడం వైద్యు రంగంలో చర్చనీయాంశంగా మారింది. పాతికేళ్లకే పిల్లలు పుట్టక ఫెర్టిలిటీ సెంటర్ల చుట్టూ తిరుగుతున్న ఈ రోజుల్లో ఇలా జరగటం వండర్ అని వైద్య నిపుణులు భావిస్తున్నారు. ప్రస్తుతం ఈ వార్త సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
జర్మనీకు చెందిన అలెగ్జాండ్ర హిల్డర్ బ్రాడ్ వయసు 66. ఆమె తాజాగా తన 10వ బిడ్డకు జన్మనిచ్చారు. పండంటి మగబిడ్డకు ఆమె ఫిలిప్ అని నామకరణం చేశారు. 66 ఏళ్ల వయసులోనూ ఎలాంటి ఫెర్టిలిటీ డ్రగ్స్ వాడకుండా, గర్భం దాల్చడంలో ఎలాంటి సమస్య లేకుండా సురక్షితంగా ప్రసవం కావడం వైద్య రంగంలో చర్చనీయాంశంగా మారింది. బెర్లిన్ లోని చారిటీ ఆస్పత్రిలో సిజేరియన్ పద్ధతిలో ఆమె మగబిడ్డకు జన్మనిచ్చారు. ఆ బాలుడు పుట్టిన సమయంలో 7 పౌండ్ల 13 ఔన్సులు ఉన్నాడని.. ఆరోగ్యంగా ఉన్నాడని వైద్యులు తెలిపారు. అలెగ్జాండ్రా ఇప్పటికే 9 మంది సంతానాన్ని కలిగి ఉంది.

ఆమె పిల్లలు 46 ఏళ్ల నుంచి 2 ఏళ్ల వయసుతో ఉన్నారు. ఆమె పిల్లలు వరుసగా స్విట్లానా(46), ఆర్టియోమ్(36),ఎలిసబెత్(12), మ్యాక్సి మీలియన్(12), అలెగ్జాండ్రా(10),లిపోల్డ్(8),అన్నా(7),మరియా(4),కథారినా(2) వయసుల మధ్య ఉన్నారు. అలెగ్జాండ్ర విజయవంతంగా 10వ బిడ్డకు జన్మనివ్వడంతో ఆమె స్నేహితులు, కుటుంబసభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆమెకు కంగ్రాట్స్ చెబుతున్నారు. ఆమె బెర్లిన్ లోని వాల్ మ్యూజియంలో ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ గా విధులు నిర్వర్తిస్తున్నారు.
తాజాగా ఓ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడారు. తాను ఇప్పటివరకూ మద్యం, ధూమపానానికి దూరంగా ఉన్నానని, ఆరోగ్యవంతమైన జీవన విధానాన్ని అనుసరిస్తున్నానని తెలిపారు. ఎప్పుడూ ఫిట్ గా, హుషారుగా ఉండేందుకు ప్రయత్నిస్తానన్నారు. అందుకే ఇప్పటికీ ఆరోగ్యంగా ఉన్నట్లు తెలిపారు. ఇక ఇలాంటి సంఘటనలు చాలా అరుదుగా జరుగుతుంటాయని బెర్లిన్ లో ని పలువురు వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు.












Click it and Unblock the Notifications