ఒబామా వైట్ హౌస్ వద్ద కంచె దూకిన ఆగంతకుడు
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష భవనం శ్వేత సౌధంలోకి ప్రవేశించిన ఓ వ్యక్తిని అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఆదివారం రాత్రి సమయంలో ఓ వ్యక్తి కత్తితో వైట్ హౌస్ చుట్టూ ఉన్న కంచెను దాటి ప్రవేశించగా..అతన్ని అరెస్ట్ చేశామని వైట్‌హౌస్ భద్రతా అధికారులు వెల్లడించారు.
అమెరికా అధ్యక్షభవనంలోకి ఇలా ఆగంతకుడు ప్రవేశించిన ఘటనలు నిరుడు ఆరు సార్లు జరుగగా..గత ఐదేళ్లలో ఇలాంటి ఘటన జరుగడం ఇది 16 వ సారి.

లోనికి ప్రవేశించిన ఆగంతకుడి పేరును సీక్రెట్ సర్వీస్ అధికారులు వెల్లడించలేదు. సెప్టెంబర్‌లో ఓ వ్యక్తి కంచె మీది నుంచి దూకాడు. అయితే అతన్ని వైట్ హౌస్‌లోకి ప్రవేశించేలోగానే అరెస్టు చేశారు.
అతని చేతిలో అనుమానాస్పదమైన ప్యాకేజీ ఉన్నట్లు చెబుతున్నారు. శ్వేత సౌధం దక్షిణం వైపు నుంచి అతను ఫెన్స్ దూకాడు. ప్యాకేజీని అధికారులు పరిశీలించారు. అయితే, అది ప్రమాదకరమైంది కాదని గుర్తించారు.












Click it and Unblock the Notifications