వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మరో స్ట్రెయిన్‌: బ్రెజిల్‌లో ఆవిర్బావం.. 10 రకాలుగా రూపాంతరం.. టెన్షన్.. టెన్షన్...

|
Google Oneindia TeluguNews

కరోనా టెన్షన్ పుట్టిస్తోంది. వ్యాక్సిన్ ఇస్తోన్నా.. సైడ్ ఎఫెక్ట్స్ తప్పడం లేదు. దీనికితోడు బ్రిటన్ స్ట్రెయిన్ భయపెడుతోంది. ఇలా ఉంటే బ్రెజిల్‌లో మరో కొత్త వైరస్ వెలుగుచూసింది. దీంతో భయాందోళన నెలకొంది. బ్రెజిల్‌లో కూడా కరోనా వైరస్ రూపు మార్చుకుంది. గత నెలలో బ్రెజిల్‌లో ఓ కొత్త స్ట్రెయిన్‌ను శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇప్పటికే అది 10 రకాలుగా రూపాంతరం చెందిందని తేల్చారు. దీనిపై మరింత అధ్యయనం చేయాల్సి ఉందని చెప్పారు.

ఈ వైరస్ ఇప్పుడు అందుబాటులో ఉన్న వ్యాక్సిన్లకు పనిచేస్తుందనే నమ్మకం లేదని వైద్య నిపుణులు చెబుతున్నారు. భారత శాస్త్రవేత్తలు కూడా దీనిపై ప్రయోగాలు ప్రారంభించారు. బ్రిటన్‌, దక్షిణాఫ్రికా స్ట్రెయిన్‌లతో పోల్చితే బ్రెజిల్‌ స్ట్రెయిన్‌లో అనేక రకాల జన్యుమార్పులను గుర్తించామని వారు తెలిపారు. ఇప్పటివరకు ఈ 'నెక్ట్స్‌ స్ట్రెయిన్‌' కేసులు భారత్‌లో ఒక్కటి కూడా నమోదుకాలేదని, జపాన్‌లో మాత్రమే వెలుగు చూశాయని చెప్పారు. అందుకే అక్కడ అకస్మాత్తుగా కేసులు పెరిగాయని చెప్పారు.

ఫోటోలు: దేశవ్యాప్తంగా కోవిడ్ వ్యాక్సినేషన్ డ్రైవ్ ప్రారంభం

another new strain found in brazil

ఇదివరకు కరోనా వైరస్ బారిన పడ్డ వాళ్లకు కూడా ఇది సోకే ప్రమాదం ఉందని వైద్యులు అన్నారు. బ్రిటన్‌, దక్షిణాఫ్రికా, బ్రెజిల్‌లో గుర్తించిన కరోనా కొత్త వైరస్ ప్రభావాన్ని ఇంకా అంచనా వేయాల్సి ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎమర్జెన్సీస్‌ చీఫ్‌ డాక్టర్‌ మైకేల్‌ రియాన్‌ తెలిపారు.

ఇన్‌ఫెక్షన్‌ పెరుగుదలకు మనుషుల ప్రవర్తన కూడా కారణమని చెప్పారు. కొత్త వేరియంట్‌పై ఆరోపణలు చేయడం చాలా సులభమన్నారు. భౌతిక దూరం, క్రమం తప్పకుండా చేతులు శుభ్రం చేసుకోవడం, మాస్క్ ధరించడం వంటి చర్యలను తప్పనిసరిగా పాటించాలని ప్రజారోగ్య అధికారులు కోరుతున్నారు.

English summary
another new strain found in brazil country.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X