Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ప్రపంచం మరో మహమ్మారిని ఎదుర్కొవాల్సిందేనా?

ప్రపంచంలో కరోనా వైరస్ మహమ్మారి సృష్టించిన వినాశనం అంతా ఇంతా కాదు. ఇప్పుడు ప్రపంచంలోని అన్ని దేశాలు ఈ మహమ్మారి నుంచి కోలుకుంటున్నాయి. ఈ నేపథ్యంలోనే కరోనా లాంటి మరో మహమ్మారిని ఎదుర్కొనేందుకు ప్రపంచ దేశాలు సిద్ధం కావాలని ఓ బ్రిటీష్ శాస్త్రవేత్త ప్రపంచానికి హెచ్చరికలు జారీ చేశారు. మరో మహమ్మారి రావడం అనివార్యమని పేర్కొన్నారు.

రాబోయే వాటికి సిద్ధం కావాలని యూకే ప్రభుత్వాన్ని కోరారు బ్రిటీష్ ప్రభుత్వానికి మాజీ ప్రధాన శాస్త్రీయ సలహాదారు, శాస్త్రవేత్త సర్ పాట్రిక్ వాలెన్స్. ఈ దేశం ఇంకా అందుకు సిద్ధంగా లేదని ఆయన నొక్కి చెప్పారు. గార్డియన్ నివేదిక ప్రకారం.. పోవిస్‌లోని హే ఫెస్టివల్‌లో జరిగిన కార్యక్రమంలో వాలెన్స్ మాట్లాడారు.

Another Pandemic Imminent in world Believes Top British Scientist

వైరస్ హెచ్చరికలను గుర్తించడానికి యూకే తప్పనిసరిగా "మెరుగైన నిఘా" పద్ధతులను అమలు చేయాలని ఆ శాస్త్రవేత్త నొక్కి చెప్పారు. మహమ్మారి లాంటి పరిస్థితిని నివారించడానికి ఆ అగ్ర శాస్త్రవేత్త కొన్ని చిట్కాలను కూడా సూచించారు. వ్యాక్సిన్‌లు, రోగనిర్ధారణ పరీక్షలు, చికిత్సలు వంటి చర్యలు ఆరోగ్య కార్యకర్తలు వైరస్‌తో పోరాడటంలో సహాయపడతాయని తెలిపారు. ఈ విషయాలను అమలు చేయగలిగినప్పటికీ, దీనికి ఇంకా సమన్వయం అవసరమని ఆయన అన్నారు.

కరోనావైరస్ మహమ్మారి భయంకరమైన అనుభవాల నుంచి ప్రపంచం బయటపడిందని.. అదే తరహా సంక్షోభం ఎదుర్కోవడం 'ఖచ్చితంగా అనివార్యం' అని పాట్రిక్ వాలెన్స్ అన్నారు. ఈ దిశలో అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని ఆయన ప్రపంచదేశాలకు పిలుపునిచ్చారు. సంక్షోభం ఎదురైన సమయంలో తక్షణమే స్పందించేందుకు అవసరమైన ఏర్పాట్లతో సిద్ధంగా ఉండాలని సూచించారు. అవసరమైన స్థాయిలో వైద్య పరీక్షల నిర్వహణ సామర్థ్యం, టీకాలు, చికిత్సలు అన్ని అందుబాటులో ఉంచుకోవాలన్నారు. దీంతో లాక్‌డౌన్‌, సోషల్‌ డిస్టెన్స్‌ తదితర వంటి కఠిన చర్యలు అవసరం ఉండబోదన్నారు.

2021లో తాను చేసిన సూచలన్నీ 2023 నాటికి అనేక దేశాలు మరచిపోయాయన్నారు ఈ శాస్త్రవేత్త. ఇది ఏమాత్రం ఆమోదయోగ్యం కాదన్నారు. సైనిక అవసరాల విషయంలో ఎలా అప్రమత్తమై ఉంటామో.. సంక్షోభం కట్టడి చర్యలకు సైతం అంతే ప్రాధాన్యం ఇవ్వాల్సిందేననని స్పష్టం చేశారు. యుద్ధంతో నిమిత్తం లేకుండా ఆర్మీ అవసరాలకు ప్రాధాన్యం ఇస్తున్నట్లుగానే సంక్షోభ నివారణ వ్యవస్థలపై దృష్టి పెట్టాలని సూచించారు. సంక్షోభ సమయంలో వివిధ దేశాలు కలిసికట్టు చర్యలు తీసుకునేలా ఒప్పందం కుదుర్చుకునేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ చొరవ తీసుకోవాలని పాట్రిక్‌ వాలెన్స్‌ సూచించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+