అదిరిపోయే శుభవార్త చెప్పిన అమెరికా

పర్యాటక, బిజినెస్‌ వీసాపైనా అమెరికాకులో ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చని, ఫెడరల్‌ ఏజెన్సీ వెల్లడించింది. అంతేకాదు.. ఇంటర్వ్యూలకు సైతం హాజరవ్వొచ్చని తెలిపింది. బి-1, బి-2 వీసాదారులకు ఈ అవకాశం ఉందని స్పష్టంగా చెప్పింది. అయితే ఉద్యోగాల్లో చేరే ముందు మాత్రం వీసాను మార్చుకోవాల్సి ఉంటుందని చెప్పింది. బి-1, బి-2 వీసాలను 'బి వీసాలు' అంటారు. వీటిని అమెరికాలో పర్యటన కోసం జారీ చేస్తారు.

తాత్కాలిక బిజినెస్‌ ట్రిప్‌ కోసం ఉద్దేశించి బి-1 వీసా మంజూరు చేస్తారు. పర్యాటకానికి వచ్చిన వారికి బి-2 వీసాలను జారీ చేస్తారు. అమెరికాలో ఇటీవల కొన్ని కంపెనీలు లేఆఫ్‌లు ప్రకటించాయి. దీంతో చాలా మంది ఉద్యోగాలు కోల్పోయి అమెరికాను వీడాల్సిన పరిస్థితి వస్తోంది. అలాంటి వారికి ఈ తరహా ఆప్షన్‌ ఒకటి ఉందని తెలియజేయడం కోసం యూఎస్‌ సిటిజన్‌షిప్‌ అండ్‌ ఇమ్మిగ్రేషన్‌ సర్వీసెస్‌ (USCIS) ఈ విషయం గురించి పూర్తిగా వివరిస్తూ వరుసగా ట్వీట్లు చేసింది.

any one can apply for jobs on b1 b2 visa in usa

'బి-1, బి-2 వీసా స్టేటస్‌పై అమెరికాలో కొత్త ఉద్యోగం వెతుక్కునే వెసులుబాటు ఉందా? అని చాలా మంది అడుగుతున్నారని, బి-1, బి-2 వీసాలపై యూఎస్ లో ఉద్యోగం చేయడం కోసం అన్వేషించవచ్చని, అలాగే ఇంటర్వ్యూలకు హాజరు కావొచ్చు'' అని USCIS తన ట్విటర్‌ ఖాతాలో వెల్లడించింది. ఒకవేళ కొత్త ఉద్యోగం సాధిస్తే మాత్రం వీసా స్టేటస్‌ను మార్చుకోవాల్సి ఉంటుందని తెలియజేసింది.

సాధారణంగా హెచ్‌-1బి వీసాలపై భారతదేశం నుంచి అమెరికా వెళ్లి ఉద్యోగం చేస్తుంటారు. లేఆఫ్‌ల్లో భాగంగా ఉద్యోగం కోల్పోతే 60 రోజుల్లో కొత్త ఉద్యోగం వెతుక్కోవాల్సి ఉంటుంది. అప్పటిలోగా ఉద్యోగం సాధించలేకపోతే దేశం వీడాల్సి ఉంటుంది. అమెజాన్‌, గూగుల్‌, మెటా వంటి పెద్ద పెద్ద కెంపెనీలు లేఆఫ్‌లు ప్రకటించిన నేపథ్యంలో బి-1, బి-2 కేటగిరీ వీసాల్లో ఉన్న వెసులుబాటును ఫెడరల్‌ ఏజెన్సీ ట్విటర్ ద్వారా గుర్తు చేసింది. ఇమ్మిగ్రెంట్‌ స్టేటస్‌ను అలాంటి వారు మార్చుకోవాలని USCIS సూచించింది

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+