13వేల ఏళ్ల క్రితమే: ఇజ్రాయెల్లో ప్రపంచ అతిపురాతన బీరు గుర్తించారు
ఇజ్రాయెల్: దాదాపు 13వేల ఏళ్ల క్రితమే బీరును వినియోగించారని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇజ్రాయెల్లోని ఓ గుహలో బీరుకు సంబంధించిన ఆనవాళ్లను వారు గుర్తించారు. ఇప్పటి వరకు ఇది అతి పురాతన బీరు. దీంతో వేల సంవత్సరాల క్రితమే బీరు తయారీ, వినియోగం ఉందని తేల్చారు.
గతంలో తాము అంచనా వేసిన దానికంటే ఐదు వేల ఏళ్లకు ముందే బీరు వినియోగానికి సంబంధించిన ఆనవాళ్లు లభించినట్లు తెలిపారు. ఇజ్రాయెల్లోని హైఫా సమీపంలో ఆల్కహాల్ ఉత్పత్తికి సంబంధించిన ఆనవాళ్లను పురాతత్వ శాస్త్రవేత్తలు కనుగొన్నారు.

అమెరికాలోని స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీ, ఇజ్రాయెల్‌లోని హైఫా యూనివర్సిటీకి చెందిన పురాతత్వ శాస్త్రవేత్తలు పరిశోధనలో పాల్గొన్నారు. ఇజ్రాయెల్‌లో పదమూడు వేల ఏళ్ల క్రితం నాటి నాటుఫియన్ గుహలో లభించిన మూడు రోళ్లను విశ్లేషించారు.
వీటిని బీరు తయారు కోసం వినియోగించేవారని గుర్తించారు. గతంలో పురాతన మానవులు ఉత్తర చైనాలో బీరు ఉత్పత్తి చేశారని గుర్తించారు. ఇది అంతకంటే ఐదువేల సంవత్సరాలకు ముందేనని తేలింది.
-
షాకింగ్ వీడియో: అమెరికా F-15 ఫైటర్ జెట్ ను పేల్చేసిన ఇరాన్ -
ఇజ్రాయెల్ కు షాకిచ్చిన ట్రంప్, ఇప్పుడు ఏం చేద్దాం? -
ఇరాన్ కు జి7 దేశాల తీవ్ర హెచ్చరిక! -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ












Click it and Unblock the Notifications