‘అల్లాహు అక్బర్’ అంటూ కత్తితో వ్యక్తి: కాల్చేశారు
ప్యారిస్: ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్ మరోసారి ఉలిక్కి పడింది. ఓ ముస్లిం వ్యక్తి కత్తితో ‘అల్లాహు అక్బర్' అంటూ ఓ పోలీస్ స్టేషన్‌లోకి చొరబడే ప్రయత్నం చేశాడు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు అతడిని కాల్చిచంపేశారు. దీంతో అతడు అక్కడికక్కడే చనిపోయాడు.
చార్లీ హెబ్డో కార్యాలయంపై ఉగ్రవాదులు దాడి జరిపి ఏడాది పూర్తయిన సందర్భంగా భద్రత గురించి ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలాండ్ సుదీర్ఘ సందేశాన్ని ఇచ్చిన కొద్ది నిమిషాలకే ఈ ఘటన చోటుచేసుకోవడం గమనార్హం.
ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. ఉత్తర ఫ్రాన్స్‌లోని 18వ జిల్లాలో గల పోలీస్ స్టేషన్ వద్ద పోలీసు అధికారులు తమ పనుల్లో బిజీగా ఉన్నారు. ఇంతలో హఠాత్తుగా చేతిలో ఓ కత్తిని ధరించిన వ్యక్తి నేరుగా స్టేషన్ వైపుగా బిగ్గరగా కేకలు వేస్తూ వస్తూ తన షర్ట్ పైకి లేపి తనను పేల్చేసుకుంటున్నట్లుగా ప్రవర్తించాడు.

దీంతో అతడు బెల్ట్ బాంబు ధరించి వచ్చి ఆత్మాహుతి దాడికి పాల్పడుతున్నాడని అనుమానించిన పోలీసులు క్షణాల్లో తేరుకుని అతడిపై కాల్పులు జరిపారు. దీంతో అతడు అక్కడే కుప్పకూలిపోయాడు.
కాగా, భద్రతా కారణాల దృష్ట్యా అతడు బెల్టు బాంబుతో వచ్చాడా లేక ఫేక్ బెల్టు బాంబుతో బెదిరించేందుకు వచ్చాడా? అన్న వివరాలు మాత్రం ఇప్పటి వరకు అధికారులు చెప్పడంలేదు.
గతంలో పారిస్‌పై దాడికి దిగిన ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు మున్ముందు కూడా ఊహించని విధంగా దాడులు చేస్తామని, అన్ని చోట్ల తమ వారు ఉన్నారని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఫ్రాన్స్ భద్రతా దళాలు ఎప్పుడూ అప్రమత్తంగా ఉంటూ ఏ చిన్న ఘటనా జరిగినా తీవ్రంగా స్పందిస్తున్నారు.
-
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!!












Click it and Unblock the Notifications