అమెరికాలో కాల్పుల కలకలం: బామ్మ మృతి, ప్రియురాలికి గాయాలు

లాస్ ఏంజిల్స్: అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం చోటు చేసుకుంది. లాస్ ఏంజిల్స్‌లోని గ్రాసరీ స్టోర్‌లో (సూపర్ మార్కెట్) కాల్పులు చోటు చేసుకున్నాయి. ఓ వ్యక్తి జరిపిన కాల్పుల్లో ప్రియురాలికి గాయాలు కాగా, బామ్మ మృతి చెందింది. ఆ తర్వాత అతను మరో స్టోర్‌లోకి వెళ్లి దాచుకున్నాడు. పోలీసులు అతనిని అదుపులోకి తీసుకున్నారు.

బాగా రద్దీగా ఉండే సూపర్‌ మార్కెట్‌ ప్రాంతంలో శనివారం సాయంత్రం ఈ సంఘటన జరిగిందని పోలీసులు తెలిపారు. మార్కెట్‌ లోపలికి ప్రవేశించిన దుండగుడు అక్కడ ఉన్న దాదాపు నలభై మందిని బందీలుగా చేసి ఇద్దరు మహిళలపై ఏడు రౌండ్ల పాటు కాల్పులు జరిపాడు.

Armed standoff at Los Angeles Trader Joes ends with one store employee dead

ఈ ఘటనలో దుండగుడి బామ్మ అక్కడికక్కడే మృతి చెందగా, అతడి ప్రియురాలు తీవ్రంగా గాయపడింది. అనంతరం దుండగుడు అక్కడి నుంచి పరారై మరో సూపర్‌ మార్కెట్‌లో దాక్కున్నాడు. అక్కడున్న వాళ్లు భయపడ్డారు. విషయం తెలిసి పోలీసులు రెండు సూపర్ మార్కెట్ల వద్ద భద్రత ఏర్పాటు చేశారు.

దుండగుడు దాక్కున్న సూపర్‌ మార్కెట్‌ చుట్టూ పోలీసులు చుట్టుముట్టి గాలించారు. సుమారు నాలుగు గంటల తర్వాత అతడిని అదుపులోకి తీసుకున్నారు. గాయపడిన యువతిని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి మెరుగ్గా ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+