జీవితం చిన్నది.. ఓ ఎఫైర్‌ను కలిగి ఉండండి
న్యూఢిల్లీ: అష్లే మాడిసన్ ఈ వెబ్‌సైట్ అక్రమ సంబంధీకులను కలిపి వివాహితుల చాటు మాటు వ్యవహారాలకు ఓ వేదికగా పని చేస్తుంది. ఈ వెబ్‌సైట్‌లో లక్షలాది మంది సభ్యత్వం తీసుకొని తమ జీవిత భాగస్వాములకు తెలీకుండా అక్రమ సంబంధాలు నెరపుతున్నారు.
ఈ విషయం తెలుసుకున్న హ్యాకర్లు ఈ సైట్‌ను హ్యాక్ చేసి అక్రమ సంబంధాలు కొనసాగించే వారి మెయిల్ ఐడీలు, ప్రొఫైళ్ళు, క్రెడిట్ కార్డుల సమాచారం దొంగిలించారు. అంతే కాదు ఎంతో మంది జీవితాలను నాశనం చేస్తున్న ఈ వెబ్‌సైట్‌ను మూసివేయక పోతే ఆ సమాచారాన్ని లీక్ చేస్తామని హెచ్చరించారు.
అయినా సరే ఈ వెబ్‌సైట్ నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో హ్యాకర్లు ఆ వెబ్‌సైట్‌లో అక్రమ సంబంధాలు నెరపిన వారి వివరాలకు సంబంధించి 9.7 గిగాబైట్ డేటాను ఇంటర్నెట్‌లో పెట్టారు. అయితే ఈ డేటాను చూడాలంటే గుప్తీకరించిన బ్రౌజర్లు కావాల్సిందే.

కెనడాకు చెందిన అష్లీ మాడిసన్ వెబ్‌సైట్ ఆన్‌లైన్ డేటింగ్ సర్వీసును అందిస్తుంది. వివాహితులకు మాత్రమే అనుమతి. ముందుగా ఈ వెబ్‌సైట్‌లో రిజస్టర్ అయి నచ్చిన వారితో అక్రమ సంబంధం పెట్టుకోవచ్చు. ప్రపంచ వ్యాప్తంగా 4 కోట్ల మంది ఈ వెబ్‌సైట్‌ను వినియోగిస్తున్నారు.
ప్రతినెలా 12 కోట్ల మంది ఈ వెబ్‌సైట్‌ను సందర్శిస్తున్నారు. పెద్దవాళ్లకు మాత్రమే అనే వెబ్ సైట్స్‌ల్లో దీని ర్యాంకు 18. జీవితం చిన్నది.. ఓ ఎఫైర్‌ను కలిగి ఉండండి అనేది దీని స్లోగన్. 2001లో ప్రారంభమైన ఈ వెబ్‌సైట్ 46 దేశాల్లో క్రీయాశీలకంగా తన కార్యకలాపాలను కొనసాగిస్తుంది. అష్లీ, మాడిసన్ అనే స్త్రీల పేర్లతో ఈ సైట్‌కు పేరు పెట్టారు.












Click it and Unblock the Notifications