నా బిడ్డకు తండ్రి ఎలాన్ మస్క్: రచయిత్రి సంచలన వ్యాఖ్యలు

టెస్లా అధినేత, అపరకుబేరుడు ఎలాన్‌ మస్క్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే తాజాగా ప్రముఖ రచయిత్రి ఆష్లే సెయింట్ క్లెయిర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన బిడ్డకు తండ్రి ఎలాన్ మస్క్ అని బాంబ్ పేల్చారు. మస్క్ తో కలిసి తాను ఓ బిడ్డకు జన్మనిచ్చినట్లు చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ప్రస్తుతం ఆ బిడ్డ మస్క్ కు 13వ సంతానం అని ఆష్లే తెలిపారు.

Ashley St Clair Claims Elon Musk is Father of Her Child Making Him Father of 13

"ఐదు నెలల క్రితం నేను ఓ బిడ్డకు జన్మనిచ్చాను. ఆ బిడ్డకు ఎలాన్ మస్క్ తండ్రి. నా బిడ్డ వ్యక్తిగత గోప్యత, భద్రత కారణాల వల్ల ఈ విషయాన్ని సీక్రెట్ గా ఉంచాను. కానీ ఇవేమీ పట్టించుకోకుండా ఇటీవల కొన్ని మీడియా ఛానళ్లు ఇదే విషయాన్ని బయటపెట్టాలని చూశాయి. అందుకే నేను ఈ విషయాన్ని బయటపెడుతున్నా. నేను నా బిడ్డను సురక్షితంగా, భద్రంగా.. సరైన వాతావరణంలో పెంచాలని అనుకుంటున్నా. అందుకే నేను మీడియాను వేడుకున్నా.. ఇలాంటి విషయాల్లోకి రావొద్దని." అని ఆష్లే తన పోస్టులో వేడుకున్నారు. అయితే ఈ ఘటనపై మస్క్ నుంచి ఎలాంటి స్పందన రాలేదు.

ఇక మస్క్ కు మొత్తం 12 మంది సంతానం. మొదటి భార్య జస్టిన్ కు పుట్టిన తొలి బిడ్డ అనారోగ్యంతో మృతి చెందింది. ఆ తర్వాత ఐవీఎఫ్ పద్దతిలో జస్టిన్ ఐదుగురు పిల్లలకు జన్మనిచ్చారు. అయితే 2008లో వారిద్దరూ విడిపోయారు. కెనడాకు చెందిన సింగర్ గ్రిమ్స్ ను వివాహం చేసుకున్నారు. ఆమెకు ముగ్గురు పిల్లలు. ఆ తర్వాత తన సంస్థలో పనిచేస్తున్న మరో మహిళతోనూ ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చినట్లు ఇటీవల మస్క్ వెల్లడించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+