ట్రంప్ పై 20 ఏళ్ల కుర్రాడి పగ: సినీ ఫక్కీలో: 130 గజాల దూరం నుంచి షూట్

Donald Trump: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై చోటు చేసుకున్న కాల్పుల ఉదంతంపై ఆ దేశ అత్యున్నత దర్యాప్తు సంస్థ ఫెడరల్ బ్యురో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్‌బీఐ) రంగంలోకి దిగింది. ఈ కేసును తాము దర్యాప్తు చేస్తోన్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ఎఫ్‌బీఐ డైరెక్టర్ క్రిస్టొఫర్ వ్రే ఓ ప్రకటన విడుదల చేశారు.

అమెరికాలో ఈ ఏడాది చివర్లో అధ్యక్ష ఎన్నికలు జరుగనున్న విషయం తెలిసిందే. రిపబ్లిక్ అభ్యర్థిగా డొనాల్డ్ ట్రంప్ వరుసగా మూడోసారి ఈ ఎన్నికల్లో పోటీలో దిగారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పెన్సిల్వేనియాలోని బట్లర్‌లో ఏర్పాటు చేసిన ర్యాలీలో పాల్గొన్నారు. ర్యాలీని ఉద్దేశించి ప్రసంగిస్తోన్న సమయంలో ఆయనపై కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఆయన కుడి చెవికి బుల్లెట్ తగిలింది. రక్తమోడింది.

Assassination attempt against Donald Trump Gunman identified as Thomas Matthew Crooks

ఈ ఘటనపై ఎఫ్ఐబీ పిట్స్‌బర్గ్ ఫీల్డ్ ఆఫీస్ స్పెషల్ ఏజెంట్ కెవిన్ రోజెక్.. మాట్లాడారు. డొనాల్డ్ ట్రంప్‌ను మట్టుబెట్టడానికే ఈ కాల్పులు జరిపినట్లు స్పష్టం చేశారు. ఈ ఉదంతాన్ని ట్రంప్ హత్యకు కుట్ర (Attempted assassination of Donald Trump)గా అభివర్ణించారు. దీని వెనుక గల కారణాలపై దర్యాప్తు సాగిస్తోన్నట్లు వివరించారు.

కాగా- డొనాల్డ్ ట్రంప్‌ను హత్య చేయడానికి ప్రయత్నించిన ఆగంతకుడిని థామస్ మాథ్యూ క్రూక్స్ (Thomas Matthew Crooks)గా గుర్తించారు ఎఫ్‌బీఐ అధికారులు. అతని వయస్సు 20 సంవత్సరాలే. పెన్సిల్వేనియా బేథెల్ పార్క్‌లో నివాసం ఉంటోన్నట్లు నిర్ధారించారు.

ట్రంప్ ప్రసంగిస్తోన్న వేదిక నుంచి సుమారు 130 గజాల దూరంలో ఉన్న ఓ మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్ రూఫ్ టాప్‌పై నుంచి కాల్పులు జరిపాడు. ఒక్కసారి కాదు పలుమార్లు కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో ఓ బుల్లెట్.. ట్రంప్‌ను గాయపరిచింది ఆయన కుడి చెవిని రాసుకుంటూ దూసుకెళ్లింది. ఈ ఘటనలో మరో ఇద్దరు గాయపడ్డారు.

ఆ వెంటనే అప్రమత్తమైన సీక్రెట్ సర్వీస్ కౌంటర్- స్నైపర్ టీమ్ ఎదురు కాల్పలు జరిపింది. స్నైపర్ సిబ్బంది జరిపిన కాల్పుల్లో థామస్ మాథ్యూ క్రూక్స్ అక్కడికక్కడే మరణించాడు. బుల్లెట్లు అతని తలను ఛిద్రం చేశాయి. ఈ కాల్పులు, ఎదురు కాల్పులకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+