విషాదయాత్ర : ఈత కొడుతుండగా చెట్టు కూలి.. 20 మంది విద్యార్థుల దుర్మరణం

Posted By:
Subscribe to Oneindia Telugu

కిన్ టాంపో: ఆఫ్రికా దేశంలోని ఘనాలో విషాదం చోటు చేసుకుంది. జలపాతం దగ్గర ఈత కొడుతున్న విద్యార్థులపై ఉన్నట్లుండి ఓ భారీ వృక్షం కూలింది. ఈ ఘటనలో 20 మంది విద్యార్థులు దుర్మరణం పాలయ్యారు.

ఘనా దేశంలోని కింటాంపో జలపాతం దగ్గర ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. ఇక్కడికి విహారయాత్రకు వచ్చిన విద్యార్థులు జలపాతం దగ్గర ఈత కొట్టేందుకు దిగారు. ఆ సమయంలోనే తుపాన్ వచ్చింది.

'At least 20 dead' after large tree crashes down at Kintampo Waterfalls in Ghana

ఒక్కసారిగా పెనుగాలులు వీచడంతో ఆ ధాటికి అక్కడే ఉన్న ఓ వృక్షం ఒక్కసారిగా నేలకూలి విద్యార్థులపై పడింది. ఈ ఘటనలో మరో 15 మంది విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు.

ప్రమాద స్థలికి ఘనా అగ్నిమాపక శాఖ సహాయ కార్యక్రమాలు చేపట్టింది. తీవ్రంగా గాయపడిన విద్యార్థుల్లో మరికొంతమంది పరిస్థితి ఆందోళకరంగా ఉన్నట్లు తెలుస్తోంది. వీరిలో ఎక్కువ మంది వెంచీ సీనియర్ హైస్కూల్ విద్యార్థులని, మిగిలిన వారు పర్యాటకులని అధికారులు వెల్లడించారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Up to 20 people have been killed and several others injured after a huge tree fell on people near a popular waterfall in Kintampo, Ghana. Police said the victims of the freak accident had been swimming during a storm when the tree fell and crashed into the revellers. Emergency workers have been trying to free the victims by cutting through the tree with chainsaws, according to the Ghana Starr News
Please Wait while comments are loading...