అమెరికాలో అరెస్టైన తెలుగు విద్యార్థులకు 'ఆట' సాయం
డెట్రాయిట్ : అమెరికాలో అరెస్టైన తెలుగు విద్యార్థులకు బాసటగా నిలిచింది అమెరికన్ తెలంగాణ అసోసియేషన్ (ఆట). డెట్రాయిట్ తో పాటు బాటిల్ గ్రీక్ డిటెన్షన్ కేంద్రాల్లో ఉన్న విద్యార్థులకు అండగా ఉండేలా చర్యలు చేపట్టింది. వారి తరపున కోర్టులో వాదించడానికి మిషిగన్ ఇమిగ్రేషన్ అటార్నీలను ఏర్పాటు చేసింది. ఆ మేరకు డిటెన్షన్ సెంటర్లలో ఉన్న విద్యార్థులను కలిసేందుకు ఆట ప్రతినిధులు అక్కడకు వెళ్లారు. అటార్నీలు కూడా వారితో పాటు వెళ్లారు.

అమెరికాలో అరెస్టైన విద్యార్థులకు సంబంధించిన సమాచారం ఇప్పటికే సేకరించామని తెలిపారు ఆట సభ్యులు. వారి కుటుంబ సభ్యులతో పాటు స్నేహితులు ఫోన్ల ద్వారా తమను సంప్రదించారని, ఆ మేరకు ఇన్ఫర్మేషన్ తీసుకున్నామని చెప్పారు. అమెరికన్ తెలంగాణ అసోసియేషన్ తరపున ఇంకా ఎవరికైనా సహాయం కావాలంటే ఈ మెయిల్ ద్వారా సంప్రదించాలని కోరారు. [email protected] కి మెయిల్ చేస్తే తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు. డిటెన్షన్ సెంటర్లకు విద్యార్థులను కలిసిన వారిలో ఆట సభ్యులు.. సత్య కందిమల్ల (ప్రెసిడెంట్), కరుణాకర్ మాధవరం (ఛైర్మన్), వినోద్ కుకునూర్ (ప్రెసిడెంట్ ఎలక్ట్), వెంకట్ మంతెన (BOD and EC)తదితరులు ఉన్నారు.
-
సీఎం చంద్రబాబుకు అల్లు అర్జున్ క్షమాపణలు... పోస్ట్ వైరల్ !! -
ఉగాదికి ముందే వారి కల నెరవేరుస్తున్న చంద్రబాబు.. మాట నిలబెట్టుకున్నారుగా! -
డిప్యూటీ సీఎం ఆఫర్ వేళ విజయ్, బీజేపీకి అన్నాడీఎంకేేే బిగ్ షాక్..! -
మూడు ముక్కల్లో ఉస్తాద్ రివ్యూ ఇచ్చిన అన్నయ్య: ట్వీటు పెడితే హీటు పెరిగినట్టే -
Putta Mahesh: టీడీపీ నుంచి ఏలూరు ఎంపీ సస్పెన్షన్ - షర్మిల షాకింగ్ ..! -
పెన్షన్లు పెంపు, మహిళలకు నెలకు రూ 2,500 - అమలు ముహూర్తం..!! -
today rashiphalalu: నేడు మీన సంక్రాంతితో ఈ రాశులవారికి తిరుగులేని అదృష్టం! -
గ్యాస్ బుకింగ్, డెలివరీ ఇక నుంచి ఇలా చేస్తేనే - తాజా మార్గదర్శకాలు..!! -
ఉక్కిరిబిక్కిరి చేస్తోన్న బంగారం ధరలు -
తెలంగాణ దశను మార్చే బిగ్గెస్ట్ రైల్వే ప్రాజెక్ట్ -
Sunrisers: సన్ రైజర్స్ ను ఆదుకున్న పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ..! విమర్శల వేళ..! -
పెట్రోల్, డీజిల్ రేట్లపై కేంద్రం రివ్యూ?












Click it and Unblock the Notifications