• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఆస్ట్రేలియా ప్రధానికి చేదు అనుభవం.. గుడ్డుతో దాడి చేసిన మహిళ (వీడియో)

|

కాన్‌బెర్రా : ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మారిస‌న్‌ కు చేదు అనుభవం ఎదురైంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన కొందరితో మాట్లాడుతున్న సమయంలో వెనుక వైపు నుంచి ఓ మహిళ గుడ్డుతో దాడి చేశారు. ఈ నెల 18వ తేదీన ఆస్ట్రేలియాలో సాధారణ ఎన్నికలు జరగనున్నాయి. ఆ క్రమంలో కాన్‌బెర్రా సమీపంలోని అల్బురిలో ప్రచారం నిర్వహించడానికి వెళ్లారు మారిసన్. అక్కడ కంట్రీ వుమెన్స్ అసోసియేషన్ ప్రతినిధులతో మాట్లాడుతున్న సమయంలో ఒక్కసారిగా ఆయన తలపై గుడ్డు పడింది.

సైకో శీనుగాడిని కస్టడీలోకి తీసుకోవడమే కాదు.. వాన్ని కాపాడటం పోలీసులకు సవాలే..!

ఆకస్మాత్తుగా వెనుక వైపు నుంచి తలపై గుడ్డు పడటంతో మారిసన్ కంగుతిన్నారు. 25 ఏళ్ల యువతి ఆయనపై దాడి చేసినట్లుగా తెలుస్తోంది. అయితే ఆ గుడ్డు మాత్రం పగలలేదు. సాక్షాత్తు ప్రధానిపై గుడ్డు అటాక్ జరగడంతో సెక్యూరిటీ సిబ్బంది అలర్టయ్యారు. ఆ సమయంలో అక్కడ ఏదో జరగబోతోందని భావించి అక్కడున్నవారు ఉరుకులు పరుగులు పెట్టారు. దాంతో స్వల్ప తోపులాట జరిగి ఓ వృద్ధురాలు కిందపడిపోతే.. ఆమెకు మారిసన్ చేయి అందించి పైకి లేపారు. ఎగ్ అటాక్ అయిన తర్వాత అదేమీ పట్టించుకోకుండా ఆమెకు సాయం చేయడం విశేషం. చివరకు ప్రధానిపై గుడ్డుతో దాడిచేసిన యువతిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అదలావుంటే మారిసన్ పై జరిగిన గుడ్డు దాడి వీడియో వైరల్ గా మారింది.

Australia PM Scott Morrison pushed by egg from woman

ఆస్ట్రేలియాలో ఇలాంటి ఎగ్ అటాక్స్ ఇదివరకు చాలానే జరిగాయి. ఈ ఏడాది మార్చి నెలలో సెనేటర్ ఫ్రేజర్ యానింగ్ మీడియాతో మాట్లాడుతుండగా.. పక్కనే నిలబడ్డ ఓ యువకుడు తన చేతిలోని గుడ్డు తీసి ఆయన తలకేసి కొట్టాడు. ఆ గుడ్డు కాస్తా పగలడంతో ఆయనకు కోపం తెప్పించింది. వెంటనే ఆ యువకుడి వైపు తిరిగి చెంప చెళ్లుమనిపించారు. అనంతరం సెక్యూరిటీ సిబ్బంది అతడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. అప్పట్లో ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారి 24 గంటల్లోపే దాదాపు 2 మిలియన్ల (20 లక్షలు) మంది వీక్షించారు. న్యూజిలాండ్ మసీదు కాల్పులపై ఫ్రేజర్ యానింగ్ వివాదస్పద వ్యాఖ్యలు చేయడంతోనే ఆ దాడి జరిగినట్లు ప్రచారం జరిగింది.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Australian PM Scott Morrison faced reaction from an woman. He has been egged by a protester while campaigning for nation's general elections. The egg pushed on Morrison's head but didn't break. She had been arrested by police. Egg thrower cowardly says Morrison.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more