తీరు మార్చుకోని బంగ్లాదేశ్: కృష్ణ దాస్‌కు నో రిలీఫ్
Bangladesh: పొరుగు దేశం బంగ్లాదేశ్- హిందువులు, ఇతర మైనారిటీలపై దాడులు, గృహ దహనాలు, అఘాయిత్యాలు, ఆకృత్యాలతో అట్టుడికిపోతోంది. రోజుల తరబడి ఇవి కొనసాగుతూ వస్తోన్నాయి. భారత్ సహా ఇతర దేశాలు బంగ్లాదేశ్ ప్రభుత్వంపై అన్ని రకాలుగా ఒత్తిళ్లు తీసుకొస్తోన్నప్పటికీ- దీనికి మాత్రం బ్రేకులు పడట్లేదు.
గత ఏడాది ఆగస్టు 5వ తేదీన ప్రధానమంత్రి షేక్ హసీనా సారథ్యంలోని ప్రభుత్వం కుప్పకూలిన విషయం తెలిసిందే. అప్పటి నుంచీ బంగ్లాదేశ్‌లో అమానుష ఘటనలు చోటు చేసుకుంటూ వస్తోన్నాయి. ప్రత్యేకించి- హిందువులపై విపరీతంగా దాడులు సాగుతున్నాయి. దోపిడీలు, గృహ దహనాలు నిత్యకృత్యం అయ్యాయి.

హిందువులతో పాటు ఇతర మైనారిటీలపై ఇస్లామిక్ మతఛాందసవాదులు విరుచుకుపడుతున్నారు. హైందవ ఆలయాలను ధ్వంసం చేయడం, భక్తిశ్రద్ధలతో పూజలందుకున్న విగ్రహాలను పగులగొట్టడం, మంటల్లో పడేయడం, తగులబెట్టడం రోజువారీ కార్యక్రమంగా మారింది. మహ్మద్ యూసుస్ సారథ్యంలో మధ్యంతర ప్రభుత్వం అక్కడ ఏర్పడినప్పటికీ ఎలాంటి ఫలితమూ ఉండట్లేదు.
ఇస్కాన్ ప్రతినిధి, బంగ్లాదేశ్ సమ్మిళిత్ సనాతన్ జాగరణ్ జొటె నాయకుడు చిన్మయ్ కృష్ణ దాస్‌ను అరెస్ట్ చేయడం దీనికి పరాకాష్ఠగా మారింది. తమ దేశ జాతీయ పతాకాన్ని అవమానపరిచారనే కారణంతో గత ఏడాది నవంబర్ 25వ తేదీన ఆయన అరెస్ట్ అయ్యారు. ఢాకా చిత్తోగ్రామ్‌లోని హజ్రత్ షాజలాల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
చిన్మయ్ కృష్ణ దాస్‌ను వెంటనే విడుదల చేయాలని, హిందువులపై దాడులను అడ్డుకునేలా బంగ్లాదేశ్ ప్రభుత్వం అంతర్జాతీయ వేదికల ద్వారా ఒత్తిడిని తీసుకుని రావాలంటూ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సైతం కేంద్రానికి డిమాండ్ చేసింది. అయినప్పటికీ ఎలాంటి ఉపయోగం ఉండట్లేదు.
తాజాగా ఆయన బెయిల్ పిటీషన్ నేడు చిత్తోగ్రామ్ న్యాయస్థానం ముందుకు వచ్చింది గానీ ఎలాంటి ఊరట లభించలేదు. దీనిపై విచారణ అనంతరం బెయిల్ ఇవ్వడానికి చిత్తోగ్రామ్ మెట్రో పాలిటన్ సెషన్స్ కోర్టు న్యాయమూర్తి మహ్మద్ సైఫుల్ ఇస్లామ్ నిరాకరించారు.
దేశద్రోహం కేసు కావడం వల్ల అనారోగ్య కారణాలపై బెయిల్ ఇవ్వలేమని కోర్టు వ్యాఖ్యానించినట్లు మీడియా తెలిపింది. బెయిల్‌పై విచారణ అరగంటలోనే ముగిసింది. డయాబెటిక్ సహా పలు అనారోగ్య కారణాలతో చిన్మయ్ కృష్ణ దాస్ బాధపడుతున్నాడని, బెయిల్‌ను మంజూరు చేయాలంటూ ఆయన తరఫు న్యాయవాది చేసిన వాదనలను కోర్టు పరిగణనలోకి తీసుకోలేదు.












Click it and Unblock the Notifications