లైంగిక వేధింపులు: బంగ్లాదేశ్ యువతి గదికి పిలిచి...

దీంతో ఆమె ఖదీముల్ పైన సోమవారం పదకొండు గంటల ప్రాంతంలో యాసిడ్‌తో దాడి చేసింది. అతనికి గాయాలయ్యాయి. ఈ ఘటన బలియడాంగి ఉపాజిలలో జరిగింది.
తన విచారణలో ఆమె జరిగిన విషయాన్ని వెల్లడించింది. ఖాదీముల్ గత కొంతకాలంగా తనను లైంగిక సంబంధం పెట్టుకోవాలని వేధిస్తున్నాడని, తాను సున్నితంగా చెప్పినప్పటికీ అతను తన వేధింపులను ఆపలేదని పోలీసులకు చెప్పింది. అతని వేధింపులు ఎక్కువయ్యాయని, అతని గొడవ తన కుటుంబంలో సమస్యగా మారిందని, దీంతో ఆగ్రహం ఆపుకోలేక యాసిడ్ పోశానని చెప్పింది.
వేధింపులు తట్టుకోలేక అతనిని గత రాత్రి అతనిని తన గదికి పిలిపించానని, అయితే అతని ప్రతిపాదనకు తాను ఎట్టకేలకు అంగీకరించానని అతను గదికి వచ్చాడని, అతను వచ్చీ రాగానే గది తలుపులు మూసేసి యాసిడ్ పోశానని చెప్పింది.
కాగా, యాసిడ్ దాడి వల్ల గాయపడ్డ అతను బాధతో అరిచాడని, దీనిని గుర్తించిన చుట్టుపక్కల వారు అతనిని ఉపాజియా హెల్త్ కాంప్లెక్స్‌కు చికిత్స నిమిత్తం తీసుకు వెళ్లినట్లు పోలీసులు చెప్పారు. యాసిడ్ దాడిలో అతడి శరీరం, పురుషాంగంకు గాయాలయ్యాయి. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి ఆమెను అదుపులోకి తీసుకున్నారు. దీంతో ఆమె పోలీసులకు వాంగ్మూలమిచ్చింది.












Click it and Unblock the Notifications