ఆ రోజు చాలా పెద్ద ప్రకటన ఉంటుంది: డొనాల్డ్ ట్రంప్

వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మరోసారి పోటీ చేయాలని మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. దీనిపై త్వరలోనే ప్రకటన చేసే అవకాశం ఉంది. తాజాగా, నవంబర్ 15 కీలక ప్రకటన చేస్తానని డొనాల్డ్ ట్రంప్ వెల్లడించడం గమనార్హం. దీంతో అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసే విషయంపైనే ఆయన మాట్లాడతారని ప్రచారం జరుగుతోంది.

అమెరికా మధ్యంతర ఎన్నికల నిమిత్తం ట్రంప్ ఒహైయోలో పర్యటించారు. ఈ సందర్భంగా ట్రంప్ మాట్లాడుతూ.. నవంబర్ 15న ఫ్లోరిడాలో తాను చాలా పెద్ద ప్రకటన చేస్తానని తెలిపారు. మూడోసారి అధ్యక్ష ఎన్నికల్లో పోటీపై ట్రంప్ ఆస్తికగా ఉన్నట్లు గత కొద్ది రోజులుగా వార్తలు వస్తున్నాయి. దీనిపై ట్రంప్ ఏమీ స్పష్టతనివ్వలేదు.

Big announcement on November 15th, says Donald Trump.

నవంబర్ 15న కీలక ప్రకటన అని చెప్పడంతో.. ట్రంప్ మరోసారి ఎన్నికల్లో పోటీ చేసే అంశంపైనే ఉంటుందని అంతా భావిస్తున్నారు. త్వరలోనే ట్రంప్ అధ్యక్ష ఎన్నికల ప్రచారం కూడా నిర్వహించే అవకాశం ఉందని స్థానిక మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి.

కాగా, అధ్యక్ష ఎన్నికలపై ట్రంప్ ఇప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని.. మధ్యంతర ఎన్నికల ఫలితాలు వచ్చావరకు వేచిచూస్తే బాగుంటుందని కొందరు రిపబ్లికన్ నేతలు సూచించినట్లు తెలిసింది. అయితే, ట్రంప్ మాత్రం అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసేందుకే మొగ్గుచూపుతున్నట్లు సమాచారం.

2016లో రిపబ్లికన్ పార్టీ తరపున పోటీ చేసి అమెరికా అధ్యక్షుడయ్యారు. తర్వాత 2020లో రెండోసారి పోటీ చేసి.. డెమోక్రటిక్ నేత జో బైడెన్ చేతిలో ఓటమిపాలయ్యారు. ఈ క్రమంలో మరోసారి అధ్యక్ష ఎన్నికల్లో పోటీకి మరోసారి ట్రంప్ సై అంటున్నట్లు తెలుస్తోంది. నవంబర్ 15న దీనిపై స్పష్టమైన ప్రకటన వచ్చే అవకాశం ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+