Bill Gates: అవును తప్పుచేశా..! ఉద్యోగులకు బిల్ గేట్స్ క్షమాపణ..!
రష్యా మహిళలతో లైంగిక సంబంధాలు నెరపి వైవాహిక బంధం తెగిపోయేందుకు కారణైనట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు, గేట్స్ ఫౌండేషన్ అధినేత బిల్ గేట్స్ (bill gates) ఎట్టకేలకు ఎప్ స్టీన్ ఫైల్స్ పై నోరు విప్పాడు. ఇప్పటికే ఎప్ స్టీన్ ఫైల్స్ లో ఈ విషయం బయటపడినా కొన్ని రోజులుగా మౌనంగా ఉండిపోతూ, భారత్ లో జరిగిన ఏఐ సదస్సుకు సైతం డుమ్మా కొట్టిన ఆయన.. ఎట్టకేలకు తన ఉద్యోగుల ముందు బయటపడ్డాడు.
ఇటీవలి టౌన్ హాల్ సమావేశంలో బిల్ గేట్స్ తన చర్యలకు బాధ్యత వహిస్తున్నట్లు ప్రకటించారు. ఎప్ స్టీన్ ఫైల్స్ లో పేర్కొన్నట్లుగా రష్యా మహిళలతో లైంగిక సంబంధాలు కలిగిఉన్నట్లు అంగీకరించాడు. కానీ ఆ సంబంధాలకూ, ఎప్ స్టీన్ బాధితులతో సంబంధం లేదని స్పష్టం చేశాడు. ఎప్ స్టీన్ తో తన గత సంభాషణల వివరాలు మీడియా నివేదికలలో మరోసారి ప్రత్యక్షమైన తర్వాత గేట్స్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

గేట్స్, ఎప్ స్టీన్ మధ్య పలు సమావేశాలను వివరించే అమెరికా డిపార్ట్‌మెంట్ ఆఫ్ జస్టిస్ రికార్డులు, ఫొటోల ప్రచురణ తర్వాత తీవ్ర విమర్శలు వచ్చాయి. ఇందులో గేట్స్ మాస్క్ వేసిన మహిళలతో ఫోజులిచ్చిన ఫొటోలు ఉన్నాయి.దీనిపై తన ఉద్యోగులతో జరిగిన అంతర్గత భేటీలో గేట్స్.. ఎప్ స్టీన్ తో సమయం గడపడం, అతనితో సమావేశాలలో సీనియర్ ఫౌండేషన్ ఎగ్జిక్యూటివ్‌లను పాల్గొనేలా చేయడం చాలా పెద్ద తప్పని అంగీకరించినట్లు తెలుస్తోంది. తన చర్యల వల్ల ప్రభావితమైన ఉద్యోగులకు ఆయన క్షమాపణలు చెప్పారు. తాను ఏ చట్టవిరుద్ధమైన పని చేయలేదని, ఏ చట్టవిరుద్ధమైన పని నేను చూడలేదని ఉద్యోగులతో చెప్పారు.












Click it and Unblock the Notifications