ఇండియన్ టెక్కీలకు గుడ్‌న్యూస్.. అమెరికాలో గ్రీన్‌కార్డులు పెరుగుతున్నాయ్!

Posted By:
Subscribe to Oneindia Telugu

వాషింగ్టన్‌: అమెరికాలో ఉన్న ఇండియన్ టెకీలకు ఇది గుడ్‌న్యూస్. గ్రీన్‌కార్డుల సంఖ్యను ఏడాదికి 45 శాతం మేర పెంచే బిల్లును యూఎస్ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్‌లో ప్రవేశపెట్టారు. ఇది చట్టంగా మారితే ఇండియన్ టెకీలకు పండుగే.

సెక్యూరింగ్ అమెరికాస్ ఫ్యూచర్ యాక్ట్ పేరుతో ట్రంప్ ప్రభుత్వం.. నైపుణ్య ఆధారిత వలస విధానం, గ్రీన్‌కార్డుల పెంపునకు సంబంధించి ఈ బిల్లును తీసుకొచ్చింది. ఇది చట్టమైతే గనక.. ప్రస్తుతం ఏడాదికి లక్షా 20 వేలుగా ఉన్న గ్రీన్‌కార్డుల సంఖ్య లక్షా 75 వేలకు చేరనుంది.

Bill for increasing allotment of Green Cards introduced in US House

ఇది హెచ్-1బీ వీసాలపై వెళ్లే ఇండియన్ టెకీలకు శుభవార్తే. అమెరికాలో శాశ్వత నివాసం ఏర్పరచుకునే అవకాశం ఈ గ్రీన్‌కార్డుల ద్వారా లభిస్తుంది. ప్రస్తుతం అమెరికాలో గ్రీన్‌కార్డుల కోసం వేచి చూస్తున్న భారతీయుల సంఖ్య 5 లక్షల వరకు ఉంది.

వీళ్లంతా ఏడాది చొప్పున హెచ్-1బీ వీసాల గడువును పొడిగించుకుంటూ వెళ్తున్నారు. కొందరైతే దశాబ్దాలుగా గ్రీన్‌కార్డుల కోసం చూస్తేనే ఉన్నారు. హెచ్-1బీ వీసాల ద్వారా తాత్కాలికంగా విదేశీ నిపుణులను తీసుకునే అవకాశం అమెరికా కంపెనీలకు ఉంటుంది. ఇప్పుడు గ్రీన్‌కార్డుల సంఖ్య పెరిగితే.. ఏళ్ల తరబడి నిరీక్షించాల్సిన అవసరం ఉండదు.
అయితే ఇదే చట్టంలో చెయిన్ మైగ్రేషన్‌ను రద్దు చేసే క్లాజ్ కూడా ఉంది. అంటే కేవలం జీవిత భాగస్వాములు, మైనర్ పిల్లలకు తప్ప మిగతా బంధువులు ఎవరికీ గ్రీన్‌కార్డులు ఇచ్చే అవకాశం ఉండకపోవడం ఇండియన్ అమెరికన్లకు కాస్త ఆందోళన కలిగించే విషయం.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A legislation backed by the Trump administration pushing for merit-based immigration and increasing the allotment of Green Cards by a hefty 45 per cent annually has been introduced in the House of Representatives, a move that could benefit Indian techies if signed into law. The legislation 'Securing America's Future Act' if passed by Congress and signed into law by US President Donald Trump will end the diversity visa programme and reduce the overall immigration levels from curre ..

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

X