ఉక్రెయిన్ పై మొదలైన దాడులు - తలదూర్చితే తీవ్ర పరిణామాలు : పుతిన్ హెచ్చరిక..!!
కొద్ది రోజులుగా కొనసాగుతున్న ఉద్రిక్తతలు ఇప్పుడు యుద్దంగా మారాయి. ఉక్రెయిన్ పైన రష్యా యుద్దం ప్రకటించింది. మిసైళ్లతో విరుచుకుపడుతోంది. ఉక్రెయిన్ దేశంపై మిలటరీ ఆపరేషన్ మొదలైందని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రకటించారు. ఉక్రెయిన్‌లోకి రష్యా సైన్యం ప్రవేశించింది. ఉక్రెయిన్ రాజధాని కీవ్ నగరంపై రష్యా బాంబుల వర్షం కురిపించింది. అటు ఉక్రెయిన్ సైతం సై అంటోంది. దేశంలో ఎమర్జెన్సీ విధించింది. రష్యా దాడి నుంచి తమ దేశాన్ని కాపాడుకుంటామన్న ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ చెప్పారు. ఉక్రెయిన్ పైన సైనిక చర్య ప్రకటించిన పుతిన్ దీనికి గల కారణాలను వెల్లిడించారు.
ఉక్రెయిన్ నుంచి ఎదురవుతున్న ముప్పుకు స్పందనగానే తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.ఉక్రెయిన్‌ను ఆక్రమించుకోవాలని తమకు ఎలాంటి లక్ష్యం లేదని పుతిన్ స్పష్టం చేసారు. రష్యా చేపట్టిన చర్యల్లో తలదూర్చేందుకు ప్రయత్నిస్తే ఇదివరకు ఎన్నడూ చూడని పరిణామాలు చూడాల్సి ఉంటుందిని పుతిన్ హెచ్చరించారు. తమ సైనిక చర్యలో ఉక్రెయిన్ భూభాగాన్ని ఆక్రమించుకోవటం లక్ష్యం కాదని పుతిన్ స్పష్టం చేసారు. ఉక్రెయిన్‌లో సైనికీకరణకు వ్యతిరేకంగా పనిచేస్తామని ప్రకటించారు.

ఉక్రెయిన్ లోని కైవ్, ఖార్కివ్ నగరాలపై మిసైల్స్ దాడి జరుగుతున్నట్లుగా తెలుస్తోంది.దీంతో ఈ పరిస్థితిని ఎలా ఎదుర్కొవాలన్న అంశంపై ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. అయితే రష్యా తాజా ప్రకటనతో ప్రపంచ దేశాలు షాక్‌కు గురవుతున్నాయి. అటు అమెరికా కూడా ఉక్రెయిన్‌కు మద్దతుగా తమ బలగాలను దించే ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం అందుతోంది. ఎలాగైనా రష్యా దాడుల నుంచి ఉక్రెయిన్‌ను కాపాడాలని అమెరికా భావిస్తోంది.
అయితే... రష్యా, ఉక్రెయిన్ దేశాల మధ్య యుద్ధం జరిగితే ప్రపంచ దేశాలకు తీవ్ర నష్టం వాటిల్లుంతుందనే అభిప్రాయం నిపుణులు వ్యక్తం చేస్తున్నారు. మరో వైపు దీని పైన అమెరికా అధ్యక్షుడు బైడెన్ తీవ్రంగా స్పందించారు. రష్యా తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఉక్రెయిన్ పై రష్యా దాడులను అమెరికా ఖండించింది. ఉక్రెయిన్ లో పరిణామాలకు రష్యా బాధ్యత వహించాలని అమెరికా స్పష్టం చేసింది. రష్యా దాడికి ప్రతిచర్య తప్పదని హెచ్చరించింది.












Click it and Unblock the Notifications