అమెరికాపై ఒబామాకు ప్రేమ లేదు: రూడీ వ్యాఖ్యలకు మద్దతుగా బాబీ జిందాల్
న్యూఢిల్లీ: న్యూయార్క్ మాజీ మేయర్ రూడీ గులియానీ అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాపై చేసిన వ్యాఖ్యలు సంచలనంతో పాటు రాజకీయ దుమారాన్ని రేపాయి. మాన్ హాట్టన్‌లో జరిగిన ఓ నిధుల సమీకరణలో మాట్లాడుతూ "ఇదో భయంకరమైన నిజం. అధ్యక్షుడు ఒబామా అమెరికాను ప్రేమిస్తున్నాడని నేను నమ్మడం లేదు" అని అన్నారు.
"నిజాయితీ చెప్పాలంటే, ఆయన దేనిని నమ్ముతారో నాకు, మీకు తెలియదు. ఆయన మనసులో ఏముందో చెప్పలేను. ఆయన ప్రవర్తించే వైఖరిపై మాట్లాడుతున్నాను" అని రూడీ గులియానీ అన్నారు. దీంతో పాటు "ఆయన మిమ్మల్ని ప్రేమించడం లేదు. నన్ను కూడా . మీరు నేను పెరిగిన విధంగా ఆయన పెరగలేదు."అని అన్నారు. ఈ వ్యాఖ్యలపై స్పందించిన వైట్ హౌస్ వర్గాలు ఈ వ్యాఖ్యలను ఖండించాయి. అనంతరం #ObamaLovesAmericaతో ట్వీట్స్ చేయడం మొదలు పెట్టారు.

తను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని గురువారం సీఎన్ఎన్‌కు ఇచ్చిన ఇంటర్యూలో రూడీ గులియానీ తెలిపారు. శుక్రవారం ఆయనకు మద్దతుగా లూసియానా గవర్నర్, ఇండియన్-అమెరికన్ బాబీ జిందాల్ తెలిపారు. ఐసీస్ ఉగ్రవాదులపై అధ్యక్షుడు ఒబామా నిజాలను మాట్లాడటంలో విఫలమవుతున్నారని, అందువల్లే రూడీ గులియానీ ఇలాంటి మాటలు మాట్లాడి ఉండవచ్చని జిందాల్ తెలిపారు.
ఈ పరిస్ధితిలో మన దేశం కోసం అధ్యక్షుడి ప్రేమ స్థాయి ఇలా ఉందని అన్నారు. అధ్యక్షుడు ఒబామా కమాండర్ ఇన్ చీఫ్‌గా తన ముఖ్య విధులను విజయవంతంగా నిర్వర్తించడంలో విఫలమయ్యాడని ప్రతి ఒక్కరికీ స్పష్టంగా తెలిసిందన్నారు.
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications