వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Body odor: ఒక్కొక్కరి శరీరం నుంచి వచ్చే వాసన ఒక్కోలా ఎందుకుంటుంది

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews

ఫ్రాన్స్‌ రాజు 14వ లూయిస్‌ ఆలోచనలు ఎప్పుడూ సువాసనలు, పరిమళాల చుట్టూ తిరుగుతుండేవి. ఆయన నివసించే వర్సయిల్స్​లో ప్రతి గది పూల రేకులతో నిండిపోయి, సుగంధ పరిమళాలను వెదజల్లుతూ, గుభాళించేది.

అక్కడ ఉండే ఫర్నీచర్ మొదలు వాటర్​ ఫౌంటైన్ల వరకు ప్రతి వస్తువు నుంచి సువాసనలు గుభాళించాల్సిందే. ప్యాలెస్​లోకి వచ్చే సందర్శకులపైనా అత్తరు చల్లనిదే లోపలికి పంపేవారు కాదంటే.. రాజుకి సుగంధ పరిమళాలంటే ఎంత మక్కువో అర్థం అవుతుంది.

శుభ్రత అంటే నేడు మనం ఊహించిన స్థాయికి ఆనాటి రాజు సరితూగకపోవచ్చు. కానీ ఇక్కడ గ్రహించాల్సిన విషయమేంటంటే లూయిస్​ సువాసన విలువ తెలుసుకున్నాడు.

మాంసం

మాంసం ఎక్కువగా తింటే...

శరీరం నుంచి వెలువడే వాసన వ్యక్తి ఆరోగ్యం గురించి, జబ్బుల జాడనూ చెబుతుంది.

ఉదాహరణకు కలరాతో బాధపడుతున్న వ్యక్తి నుంచి తీపి వాసన, డయాబెటిస్​ ఉంటే కుళ్లిన ఆపిల్​ పళ్ల వాసన వెలువడుతుంది.

'మన ఆహారపు అలవాట్లను కూడా శరీర వాసన చెబుతుంది’ అని ఆస్ట్రేలియాలోని మాక్వేరీ విశ్వవిద్యాలయానికి చెందిన సైకాలజిస్ట్‌ మెహ్మెట్ మహముత్ చెప్పారు.

'మాంసాహారం ఎంత ఎక్కువ తీసుకుంటే, శరీరం నుంచి వెలువడే సువాసన అంత బావుంటుందని మా పరిశోధనలో తేలింది. ఈ విషయాన్ని మరో రెండు అధ్యయనాలు విభేదిస్తున్నాయి’ అని ఆయన వెల్లడించారు.

ప్రతి నెలా రుతుచక్రంలో భాగంగా కొత్త అండం తయారై, విడుదలయ్యే వరకూ మహిళల నుంచి వచ్చే పరిమళాన్ని, పురుషులు ఆస్వాదిస్తారు. పూర్వం మహిళల రుతుక్రమాన్ని ఈ విధంగానే అంచనా వేసి, గర్భం దాల్చేందుకు ప్రయత్నాలు చేసేవారు.

పురుషుల్లోని టెస్టోస్టిరాన్​ హర్మోను వారి నుంచి వెలువడే సువాసనను ప్రభావితం చేస్తుంది.

జన్యువులు ప్రభావితం చేస్తాయ్

మనం తీసుకునే ఆహారం, ఆరోగ్యాన్ని బట్టి ఈ సువాసన మారవచ్చు. వంశ పారంపర్యంగా వచ్చే జన్యువుల ఆధారంగా కూడా మన శరీర వాసన ప్రత్యేకంగా ఉంటుంది.

మన శరీరం నుంచి వచ్చే వాసన నిర్దిష్టమైనది. ఒకే రకమైన వాసనను ఇట్టే గుర్తుపట్టేయగల సామర్ధ్యం మన సొంతం.

ఇద్దరు కవలల నుంచి వెలువడే వాసన ఒకే రకంగా ఉంటుంది. చెమటతో కూడిన వీరి టీ షర్టులను, ఇతరుల టీ షర్టులతో కలిపేస్తే, ఏ టీ షర్టు ఏ కవలదో గుర్తుపట్టలేం.

మనం వాసన చూడగల సామర్థాన్ని జన్యువులు ప్రభావితం చేస్తాయి’ అని పోలండ్‌లోని వ్రోక్లా విశ్వవిద్యాలయానికి చెందిన సైకాలజిస్ట్‌ అగ్నిస్కా సారోకోవాస్కా తెలిపారు.

'అంటే వాసన చూసి, ఇతరుల జన్యువుల సమాచారాన్ని మనం చెప్పొచ్చు’ అని పేర్కొన్నారు.

అవే ఎందుకు నచ్చుతాయి?

కొన్ని సౌందర్య సాధనాలను మనం ఎన్నటికీ వదిలిపెట్టలేం. జీవితాంతం వాటిని వాడాలని నిర్ణయించేసుకుంటాం. ఇందుకు కారణం మన జన్యు స్వభావానికి, సదరు సాధనాలు సరిపోవడమే.

ఒక వ్యక్తి వాడే సౌందర్య సాధన సువాసనని బట్టి వారి వ్యక్తిత్వాన్ని అంచనా వేయొచ్చని సారోకోవాస్కా బృంద పరిశోధనల్లో వెల్లడైంది.

ఇలాగే రాజు లూయిస్​ సందర్శనకు వచ్చే వారందరూ ఆయన వ్యక్తిత్వాన్ని అంతో ఇంతో అంచనా వేసుకునేవారు.

ఈ సమాచారమంతా మన శరీర సువాసనకు సంబంధించినదే అయినా.. దీని వల్ల ఏదైనా ఉపయోగం ఉందా?

ఒక ప్రయోగంలో మహిళలకు కొందరు పురుషులు ధరించిన టీ షర్టులను ఇచ్చి, వాసన ఎంత ఆహ్లాదకరంగా ఉందో ర్యాంకుల వారీగా చెప్పమని అడిగారు. వారిచ్చిన ప్రాధాన్యత క్రమం.. హ్యూమన్‌ ల్యూకోసైట్‌ యాంటిజెన్‌(హెచ్‌ఎల్‌ఏ) వైరుద్ధ్యాన్ని పోలివుంది.

హెచ్‌ఎల్‌ఏ అనేది కొన్ని ప్రోటీన్ల సమూహం. రోగ నిరోధక శక్తి, సొంత కణాలను గుర్తించేందుకు ఇది సహాయ పడుతుంది.

అంటే పరోక్షంగా రోగాలను కలిగించే కణాలను వేరు చేస్తుందన్నమాట. మన వ్యాధి నిరోధక శక్తిని ఉత్తేజపరిచే ఎంహెచ్​సీ అనే మరో ప్రోటీను, హెచ్ఎల్​ఏతో పాటు ఇతర ప్రోటీన్లతో కలిసి పని చేస్తుంది.

మన వ్యాధి నిరోధక వ్యవస్థ శరీరానికి ఎలాంటి రక్షణలను కల్పిస్తుందో తెలుసుకోవడానికి వీటి పని తీరే సైంటిస్టులకు ఉపయోగపడుతోంది.

శరీర సువాసన

హ్యూమన్‌ ల్యూకోసైట్‌ యాంటిజెన్‌ - హెచ్​ఎల్​ఏ ప్రొఫైల్​ అందరికీ ఒకేలా ఉండదు. ఒక్కొక్కరికీ ఒక్కోలా ఉంటుంది. అతి దగ్గర బంధువులకు మాత్రమే హెచ్​ఎల్​ఏ ఒకరిది, మరొకరిని పోలి ఉంటుంది.

జన్యుపరంగా చూస్తే 'హెచ్​ఎల్​ఏ ప్రొఫైల్​ వేర్వేరుగా ఉన్న ఇద్దరు వ్యక్తుల వల్ల జన్మించిన సంతానానికి ఎక్కువ వ్యాధి నిరోధక శక్తి ఉంటుంది’ అని సొరోకోవాస్కా పేర్కొన్నారు.

మహిళలందరూ తమకు పూర్తిగా భిన్నమైన హెచ్​ఎల్​ఏ ప్రొఫైల్​ కలిగిన పురుషుల టీ షర్టులను మాత్రమే ఎంచుకున్నారు. అంటే వ్యాధి నిరోధక వ్యవస్థ జన్యువులను పెంపొందించగలిగే భాగస్వామిని వాసన ద్వారా వాళ్లు గుర్తుపట్టగలిగారు. ఈ ఎంపిక వారికి తెలియకుండానే జరిగిపోయిందనే విషయం వాస్తవం.

అయితే, హెచ్​ఎల్​ఏ ప్రొటీన్​లో ఉండే ఏ మెకానిజం సువాసనను ఇట్టే పసిగట్టగలిగే శక్తినిస్తుందో తాము కచ్చితంగా గుర్తించలేకపోయామని సోరోకోవాస్కా తెలిపారు.

'కానీ మన శరీరంపై ఉండే బ్యాక్టీరియా కొన్ని రకాల పదార్థాలను జీర్ణం చేసుకుని, హ్యూమన్‌ ల్యూకోసైట్‌ యాంటిజెన్‌- హెచ్ఎల్​ఏని ఉత్పత్తి చేస్తుంది. ఇదే ఒక రకమైన వాసనను విడుదల చేస్తుంది’ అని భావిస్తున్నామని చెప్పారు.

శరీర సువాసన

భాగస్వాముల ఎంపిక అలానే జరుగుతోందా?

శారీరక సువాసనల్లో దాగున్న జన్యుపరమైన సమాచారం ఆధారంగానే మనుషులు తమ జీవిత భాగస్వాములను ఎంపిక చేసుకుంటున్నారా అంటే కాదనే చెప్పాలి.

దాదాపు 3700 జంటలపై చేసిన అధ్యయనంలో, కచ్చితంగా వేర్వేరు హ్యూమన్‌ ల్యూకోసైట్‌ యాంటిజెన్‌ -హెచ్​ఎల్​ఏను కలిగిన వారు అరుదుగా కనిపించారు.

మనం కొన్నిరకాల సువాసనలను ఇష్టపడొచ్చు. దాని వెనుక జన్యు పరమైన కారణం కూడా ఉండొచ్చు. కానీ సువాసన ఆధారంగా ఒకరిని పెళ్లి చేసుకోలేం.

'హెచ్​ఎల్​ఏ ఒక వ్యక్తి ఎంపికను ప్రభావితం చేయలేకపోయినా, శృంగార జీవితాన్ని మాత్రం కచ్చితంగా ప్రభావితం చేస్తుంది’ అని సోరోకోవాస్కా వెల్లడించారు. వాసనను గుర్తించలేని జబ్బుతో బాధపడుతున్న వారికి భాగస్వామితో బలమైన సంబంధం ఉండదని పరిశోధకులు మహమూత్​ పేర్కొన్నారు.

యాధృచ్ఛికంగా వేర్వేరు హెచ్​ఎల్​ఏలను కలిగిన వ్యక్తులు జీవిత భాగస్వాములైతే వారి శృంగార జీవితం బావుంటుంది. పిల్లలు కావాలనే కోరిక కూడా బలంగా ఉంటుంది. అదే ఒకే రకమైన హెచ్​ఎల్​ఏను కలిగిన వ్యక్తిని పెళ్లి చేసుకున్న మహిళల శృంగార జీవితం సంతృప్తికరంగా ఉండదు. పిల్లలు కావాలనే కోరికా తక్కువగా ఉంటుంది. దీనిపై వేర్వేరు పరిశోధనలు పలు రకాలుగా చెప్పడంతో ఫలితాలపై ఏకాభిప్రాయం లేదు.

శరీర సువాసన

స్పీడ్​ డేటింగ్​ వెనుక సువాసనలు?

శారీరక సువాసనలు, స్పీడ్​ డేటింగ్​ కల్చర్​ మధ్య సంబంధముంది. అయితే, సువాసన ఆధారంగా డేటింగ్​ చేయాలనే ఆలోచన మంచిదేనా అనే దానిపైనా భిన్నవాదనలున్నాయి.

మనకు ఒక పని ఇష్టమన్నంత మాత్రానా, దాని మీదే ఆధారపడి నిర్ణయాలు తీసుకోవాలని లేదు కదా. అలా ఎవరైనా చేస్తారా?

సువాసన ఆధారంగా తెలుసుకునే సమాచారంతో నిజ జీవితంలో సంఘటనలను ఎదుర్కొవడం చాలా కష్టం. సువాసన ద్వారా మనం సేకరించే సమాచారాన్ని, అదే సమయంలో గ్రహించే ఇతరత్రా సమాచారం పాడు చేస్తుంది.

ఒక వ్యక్తిలోని చెడు భావాలను, కోపాన్ని, ఆవేశాన్ని, ఆవేదనను వాసన ద్వారా పసిగట్టవచ్చని సోరోకోవాస్కో తెలిపారు. అదే వ్యక్తి ముఖాన్ని ఫొటోల్లో చూడటం ద్వారా పైభావాలను సరిగా గుర్తించలేమని ఆమె వెల్లడించారు. ముఖం చూసి చెప్పడం సులువు గనుక అందరూ చూసి చెప్పడానికే మొగ్గుచూపుతారన్నారు.

శరీర సువాసన

పెళ్లైన వారిపైనా శోధన

మరో ప్రయోగంలో, కొందరు మహిళల భర్తల టీ షర్టులను, పెళ్లికాని అమ్మాయిల స్నేహితుల టీ షర్టులను ఇతరుల టీ షర్టులతో కలిపేశారు. ఇందులో పెళ్లైన మహిళలందరూ తమ భర్తల టీ షర్టులను మొదట ఎంపిక చేయలేదని మహమూత్​ వెల్లడించారు. అలాగని అందరూ వేరే వ్యక్తుల దుస్తులను తొలి ఎంపికగా తీసుకోలేదు.

అసలు పరిచయం లేని వ్యక్తి నుంచి వచ్చే సువాసన, పెళ్లైన పురుషుల నుంచి వచ్చే సువాసన కంటే బలంగా ఉందని మహమూత్​ చేసిన మరో పరిశోధనలో వెల్లడైంది.

టెస్టోస్టిరాన్​ హార్మోన్​ను అధికంగా కలిగివుండటం వల్లే ఇలా జరిగివుండొచ్చని ఆయన పేర్కొన్నారు. మగవారిలో వయసు పెరిగే కొద్ది టెస్టోస్టిరాన్​ స్థాయి తగ్గుతుందన్న విషయం తెలిసిందే.

40 ఏళ్లు దాటే సరికి పెళ్లి చేసుకుని, పిల్లల భవిష్యత్​పై శ్రద్ధ చూపడం తదితరాలు ఇందుకు కారణాలు.

శరీరం నుంచి వెలువడే పరిమళం మన పునరుత్పత్తి శక్తిని తెలియజేస్తుందన్న విషయం మనకు తెలుసు. మనం దాన్ని గుర్తించగలమని కూడా తెలుసు. కానీ దానికి అనుగుణంగా మనం ప్రవర్తించం. అలా చేస్తున్నామా?

'సరైన జన్యువులను కలిగిన జీవిత భాగస్వామి కోసం మీరు అన్వేషిస్తుంటే కచ్చితంగా శరీర సువాసనపై దృష్టి పెట్టాలి’ అని సోరోకోస్కావా చెప్పారు. 'కానీ, అందరికీ అది ముఖ్యం కాదు. చాలా మంది ఆ పని చేయరు కూడా’ అని అన్నారు.

'వేల ఏళ్లుగా మన సువాసనను మనమే దాచి పెడుతున్నాం. దాంతో సువాసన వల్ల ఒనగూరే ప్రయోజనం కొంత మేర తగ్గింది’ అని మహమూత్ ఒప్పుకున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Body odour:Why does the smell coming from different people different
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X