Cheating Wife:భార్యకు కడుపు నా వల్ల రాలేదు -సీమంతంలో సీన్ చూపించిన భర్త -వైరల్ వీడియో

చాలా కుటుంబాలు పెళ్లిళ్లతోపాటు సీమంతం వేడుకనూ ఘనంగా నిర్వహించుకోవడం మనం చూస్తుంటాం. తల్లి సౌభాగ్యాన్ని, పుట్టబోయే బిడ్డ దీర్ఘాయుష్షును కోరుతూ, కడుపులోని బిడ్డ ఆరోగ్యకరంగా ఎదగడానికి తల్లి శారీరక, మానసిక ఉల్లాసం అవసరరాన్ని గుర్తుచేస్తూ.. అందుకోసం ఆమె, ఆమె భర్త పాటించవలసిన నియమాలను ఉపదేశిస్తూ జరిపే వేడుకే సీమంతం. కానీ అదే ఫంక్షన్ వేదికగా.. చుట్టాలు, ఇరుగుపొరుగు సాక్షిగా భార్య మోసాన్ని, కడుపులో పెరుగుతోన్న బిడ్డకు అసలు తండ్రి ఎవరనే నిజాన్ని ఆధారాలతో సహా బయటపెట్టా భర్త..

అసలైన తండ్రి కూడా అక్కడే..

అసలైన తండ్రి కూడా అక్కడే..

సినీ ఫక్కీలో భార్య మోసాన్ని బయటపెట్టిన భర్త తాలూకు వీడియో ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది. స్థానిక సంప్రదాయం ప్రకారం ఓ కుటుంబం సీమంతం వేడుక నిర్వహించగా, బంధువులు, దగ్గరి స్నేహితులు హాజరయ్యారు. ప్రార్థనల తర్వాత.. పుట్టబోయే బిడ్డ క్షేమం కోరుతూ ఒక్కొక్కరుగా దీవెనలిచ్చారు. ఆ క్రమంలోనే మైక్ అందుకున్న భర్త.. అందరి ముందు సంచలన విషయాలు వెల్లడించాడు. భార్య ప్రెగ్నెన్సీకి కారణం తాను కాదని బాంబు పేల్చాు. అతిథిగా వేడుకలో పాల్గొన్న ఓ వ్యక్తిని చూపిస్తూ.. అసలైన తండ్రి ఇతనే అని ఆధారాలు బయటపెట్టాడు. బొలీవియా దేశంలో గత చోటుచేసుకున్న ఈ సంఘటన లోతుల్లోకి వెళితే..

భార్య వీడియోలు బట్టబయలు..

నెట్టింట సంచలనంగా మారిన బొలీవియన్ జంటకు పెళ్లయి ఐదేళ్లు కావొస్తోంది. మొదట్లో అన్యోన్యంగా సాగిన దాంపత్యం మెల్లగా ముఖంమొత్తేస్థాయికి దిగజారింది. ఫ్యామిలీ ఫ్రెండైన ఓ వ్యక్తితో ఆ మహిళకు దగ్గరితనం ఏర్పడింది. భర్తకు తెలియకుండా ఆమె రహస్యంగా ఆ వ్యక్తితో గడిపేది. ప్రవర్తనలో మార్పు రావడంతో భార్యపై అనుమానం పెంచుకున్న భర్త.. ఆమె కదలికలపై కన్నేసి ఉంచాడు. చివరికి ఆమె మోసాన్ని గుర్తించాడు. ఫ్యామిలీ స్నేహితుడితో తన భార్య కలిసున్నప్పటి వీడియోలను బట్టబయలు చేశాడు. అంతేకాదు..

లాయర్ సహాయం.. రచ్చరచ్చ

లాయర్ సహాయం.. రచ్చరచ్చ

గడిచిన మూడేళ్లుగా తన భార్య వేరొక వ్యక్తితో గడుపుతూ, మోసానికి పాల్పడుతున్నదని, కడుపులో పెరుగుతోన్న బిడ్డకు తాను తండ్రిని కాదని ఆ భర్త వాదించాడు. తన లాయర్ సాయంతో.. ఆ బిడ్డకు అసలైన తండ్రి ఎవరో ఆస్పత్రులు, డాక్టర్ల ద్వారా సేకరించిన రిపోర్టులను కూడా సీమంతం వేడుకలో బయటపెట్టాడు. భార్య ప్రియుడిని కూడా ముందుకు లాక్కొచ్చి, ఆ ఇద్దరూ కలిసున్న వీడియోలను బంధువులందరికీ చూపించిన భర్త.. ఇక ఆమెను ఏలుకోలేనంటూ బయటికి నడిచాడు. షాక్ నుంచి తేరుకున్న భార్య తరఫు బందువులు ఆ మూడో వ్యక్తిని చితకబాదారు. చివరికి తలో దిక్కూ వెళ్లిపోయారు..

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+