వార్నీ.. భారత్ లో ఇట్టాంటోళ్లు ఉన్నారేంట్రా బాబు
హర్యానాలో ఓట్ చోరీ చోటు చేసుకుందని లోక్ సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలు బ్రెజిల్ దాకా పాకాయి. బ్రెజిల్ కు చెందిన ఓ మోడల్ ఫొటోను ఇక్కడ వాడుకున్నారని ఆయన విమర్శించారు. ఓట్ చోరీ జరిగిందనడానికి అవసరమైన సాక్ష్యాధారాలన్నింటినీ ఆయన ప్రదర్శించారు. పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. కర్ణాటక, హర్యానా వంటి రాష్ట్రాల్లో కేంద్రం ఓట్ చోరీకి పాల్పడిందనీ ఆరోపించారు. హర్యానాలో కాంగ్రెస్ ఓటమికి కేంద్రం, ఈసీ కుమ్మక్కయ్యాయని ధ్వజమెత్తారు.
హర్యానా లోక్ సభ వినియోగించినట్లు చెబుతోన్న ఈ ఫొటోపై బ్రెజిలియన్ మోడల్ లారిస్సా స్పందించారు. ఆ ఫోటో తనదేనని తెలిపారు. దీనికి సంబంధించిన ఓ వీడియోను తన అధికారిక ఎక్స్ అకౌంట్ లో పోస్ట్ చేశారు. తన స్నేహితులను ఉద్దేశించి పోర్చుగీస్ లాంగ్వేజ్ లో మాట్లాడారామె. మీకు ఒక జోక్ చెబుతాను.. వారు (భారతీయులు) నా పాత ఫొటోను ఉపయోగిస్తున్నారు. అప్పుడు నాకు సుమారు 18-20 సంవత్సరాలు ఉంటాయి.. అని అన్నారు.

ఓ రిపోర్టర్ ద్వారా ఈ విషయం తనకు తెలిసిందని లారెస్సా తెలిపారు. దీని గురించి తెలుసుకోవడానికి తనకు ఫోన్ కాల్ చేశాడని, తన ఫొటో గురించి ఆరా తీశాడని చెప్పారు. అప్పటివరకు ఈ విషయం గురించి తనకు తెలియదని పేర్కొన్నారు. పవర్ పాయింట్ ప్రజంటేషన్ లో ప్రదర్శించిన ఫొటోను తన స్నేహితుడొకడు వాట్సప్ చేశాడని, దాన్ని గ్రూప్ లో పోస్ట్ చేస్తున్నానని వివరించారు. ఆ ఫొటో తనదేనని, దాని గురించి స్పష్టతం ఇవ్వడం అవసరమని అన్నారు.
భారత ఎన్నికల వ్యవస్థలో తన ఫొటో ప్రచారంలోకి రావడం నమ్మశక్యం కావట్లేదని లారిస్సా అన్నారు. తనను మోసం చేయడానికి భారతీయురాలిగా చిత్రీకరిస్తున్నారని వ్యాఖ్యానించారు. వాట్ మ్యాడ్ నెస్.. అని ఘాటుగా రియాక్ట్ అయ్యారు. ఇది పిచ్చితనమని వ్యాఖ్యానించారు. మనం ఏ లోకంలో ఉన్నామని ఆవేదన వ్యక్తం చేశారు.
The name of the Brazilian Model seen in @RahulGandhi's press conference is Larissa. Here's her reaction after her old photograph went viral. pic.twitter.com/K4xSibA2OP
— Mohammed Zubair (@zoo_bear) November 5, 2025
లారిస్సా ప్రస్తుతం మోడల్‌గా పనిచేయట్లేదు. బ్రెజిల్‌లో బెలో హారిజోంటేలో ఓ యూనిసెక్స్ సెలూన్‌ను నడుపుతున్నారు. దీనికి బ్రెజిల్ లో చాలాచోట్ల ఫ్రాంఛైజీలు ఉన్నాయి. ఫ్యాక్ట్-చెకర్ మహమ్మద్ జుబైర్ ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసిన తర్వాత లారిస్సా ప్రతిస్పందన వచ్చింది. రాహుల్ గాంధీ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో చూపించిన ఫోటో భారతీయ ఓటరుది కాదని జుబైర్ స్పష్టం చేశారు. ఈ విషయం ఆన్‌లైన్‌లో విస్తృతంగా చర్చకు దారితీసింది.
-
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
టీవి ఛానళ్లకు కేంద్రం బిగ్ షాక్.. టీవి రేటింగ్స్‌పై కొత్త పాలసీ !! -
Petrol: మార్చి గండం.. 'నో స్టాక్' బోర్డులకు అసలు కారణం ఇదే! -
సీఎం సభ నుంచి వస్తుండగా ఊహించని ప్రమాదం.. 10 మంది దుర్మరణం! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
తిరుమలలో హోటళ్ల బంద్, భక్తుల ఇబ్బందులు- ఆ ఒక్కటే ఆధారం..!! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
మడమ తిప్పని ఇరాన్: శాంతి కోసం 5 కండీషన్లతో అమెరికాకు షాక్ -
భారత జట్టుకు అవమానం.. స్టేడియంలోకి నో ఎంట్రీ! -
శ్రీరాముడిగా మెప్పించిన తెలుగు హీరోలు వీళ్ళే..? -
మళ్ళీ లాక్డౌన్? కేంద్రం సంచలన ప్రకటన -
వచ్చే మూడు నెలలు హై అలర్ట్, ఏపీలో ఎండల ముప్పు











Click it and Unblock the Notifications