బ్రెగ్జిట్ బిల్లుకు బ్రిటన్ రాణి ఎలిజిబెత్ ఆమోదం

Posted By:
Subscribe to Oneindia Telugu

బ్రిటన్: బ్రెగ్జిట్ బిల్లుకు బ్రిటన్ రాణి ఎలిజెబెత్ 2 ఆమోదం తెలిపారు. బ్రిటన్ పార్లమెంటు ఈ బిల్లుకు రెండు రోజుల క్రితం ఆమోదముద్ర వేసింది. ఇప్పుడు రాణి కూడా ఆమోదం తెలిపారు.

బ్రెగ్జిట్‌‌తో ఐరోపా కూటమి నుండి బ్రిటన్‌ నిష్క్రమణకు సంబంధించిన చర్చలను ప్రారంభించేందుకు ప్రధాని థెరెస్సామే‌కు మార్గం సుగమమైంది. తొలుత ఈ బిల్లుకు హౌస్‌ ఆఫ లార్డ్స్‌ (ఎగువసభ) ప్రతిపాదించిన సవరణలను దిగువ సభ (హౌస్‌ ఆఫ్‌ కామన్స్‌) తిరస్కరించింది.

brexit

బ్రెగ్జిట్‌పై చర్చలు ప్రారంభమైన మూడు నెలల్లోగా బ్రిటన్‌లో నివసిస్తున్న ఐరోపా జాతీయుల పరిస్థితిని కాపాడాలని సభ ప్రభుత్వాన్ని కోరింది. అనంతరం ఈ బిల్లును 335-287 ఓట్ల తేడాతో ఆమోదించింది.

బ్రెగ్జిట్‌ ఒప్పందంపై అర్థవంతమైన ఓటు వేయాలంటూ పార్లమెంట్‌కు వివిధ వర్గాల నుండి అందిన పిలుపులను సభ్యులు తిరస్కరించారు. దీనితో ఇయు (నోటిఫికేషన్‌ ఆఫ్‌ విత్‌డ్రాయల్‌) బిల్లును హౌస్‌ఆఫ్‌ కామన్స్‌ ఎటువంటి మార్పులూ లేకుండా ఆమోదించినట్లయింది. బిల్లుకు ఇప్పుడు ఎలిజెబెత్‌ రాణి ఆమోదముద్ర వేయడంతో చట్టరూపమైంది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
The Queen has given Royal Assent to the Brexit bill, clearing the way for Theresa May to start talks to leave the European Union.
Please Wait while comments are loading...