కాలిఫోర్నియా భయంకపితం..!!

California earthquake: కాలిఫోర్నియాలో భూకంపం అమెరికాలోని కాలిఫోర్నియాలో పెన్ను భూకంపం సంభవించింది. దీని తీవ్రత స్కేల్ పై 7.0 రికార్డుగా అయింది. తీర ప్రాంత నగరం కావడం తీవ్రత అధికంగా ఉండటం వల్ల తొలుత సునామి హెచ్చరికలు సైతం జారీ చేశారు. ఆ తర్వాత వాటిని ఉపసంహరించుకున్నారు.

కాలిఫోర్నియా ఉత్తర ప్రాంతం తో పాటు సదరన్ ఒరేగాన్ తీర ప్రాంతం మొత్తం తోలుతా సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయి ఈ రెండు ప్రాంతాల్లో కూడా దాదాపు 4.7 మిలియన్ల మంది నివసిస్తున్నారు. అమెరికా కాలమానం ప్రకారం ఉదయం 10:44 నిమిషాల సమయం భూమి ప్రకంపించింది.

California earthquake Magnitude 7 0 hits US coastal City of United States

కాలిఫోర్నియా సమీపంలోని హంబోల్ట్ కౌంటీ పరిధిలోని ఓ చిన్న టౌన్ ఫెర్నాడేల్‌ను భూకంప కేంద్రంగా గుర్తించినట్లు యూఎస్ జియాలాజికల్ సర్వే తెలిపింది. ఉపరితలం నుంచి సుమారు తొమ్మిది కిలోమీటర్ల లోతున ఫలకాల్లో చోటు చేసుకున్న పెను కదలికల వల్ల భూకంపం సంభవించినట్లు యూఎస్‌జీఎస్ పేర్కొంది.

రిక్టర్ స్కేల్‌పై భూకంప తీవ్రత 7గా రికార్డయిన వెంటనే హొనొలులులోని నేషనల్ సునామీ సెంటర్ అధికారులు అప్రమత్తం అయ్యారు. సునామీ హెచ్చరికలను జారీ చేశారు. సునామీ సంభవించే పరిస్థితులు కనిపించకపోవడంతో వాటిని ఉపసంహరించుకున్నారు.

భూకంప తీవ్రత కాలిఫోర్నియా బే ఏరియాపై పడింది. ఈ ప్రాంతం మొత్తాన్ని ఖాళీ చేయించారు అక్కడి కోస్టల్ అధికారులు. సందర్శకులను వెనక్కి పిలిపించారు. బీచ్‌లను మూసివేశారు. తీరంలో ఉవ్వెత్తున ఎగిసిపడ్డాయి. కొన్ని చోట్ల సముద్రం ముందుకు దూసుకొచ్చింది.

భూకంప కేంద్రం నుంచి సుమారు 300 చదరపు కిలోమీటర్ల వరకూ దీని తీవ్రత కనిపించింది. భూకంపం వల్ల ఇప్పటివరకు ఎలాంటి ప్రాణనష్టం సంభవించినట్లు సమాచారం అందలేదు. కొన్ని చోట్ల ఆస్తినష్టం జరిగినట్లు సమాచారం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+