Nobel Prize: నోబెల్ పురస్కారాన్ని వదిలేసిన ఘటనలు
ప్రపంచంలో అత్యున్నత గౌరవంగా భావించే పురస్కారం ఏదైనా ఉందంటే అది నోబెల్ ప్రైజ్. ఒకసారి ఆ పేరు జీవితానికి అతుక్కుంటే, ఆ వ్యక్తి చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోతాడు. శాస్త్రం, సాహిత్యం, శాంతి, ఆర్థికం... ఏ రంగమైనా సరే.. నోబెల్ అందుకోవడం అంటే వ్యక్తిగత విజయానికి మించి మానవాళికి చేసిన సేవలకు గుర్తింపు. కానీ అలాంటి పురస్కారం ఇప్పుడు మరోసారి ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. కారణం.. వెనెజువెలా విపక్ష నేత మారియా కొరీనా మచాడో చేసిన ఒక నిర్ణయం.
అమెరికా పర్యటనలో ఉన్న మచాడో... తనకు దక్కిన నోబెల్ పురస్కారాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు బహుమతిగా అందించారు. వెనెజువెలా ప్రజల స్వేచ్ఛ కోసం ట్రంప్ చేసిన ప్రయత్నాలకు గుర్తింపుగా ఈ అవార్డును ఇస్తున్నానని ఆమె వ్యాఖ్యానించారు. ఈ సంఘటన వెంటనే రాజకీయంగానే కాదు, నైతికంగా కూడా తీవ్ర చర్చకు దారి తీసింది. "నోబెల్‌ను ఇలా ఇచ్చేయొచ్చా?" అనే ప్రశ్న ప్రపంచవ్యాప్తంగా వినిపించింది.

నిబంధనల ప్రకారం..
ఈ వివాదంపై నార్వే నోబెల్ ఇనిస్టిట్యూట్ వెంటనే స్పందించింది. నోబెల్ కమిటీ నిబంధనల ప్రకారం - ఒకసారి నోబెల్ పురస్కారం ప్రకటించిన తర్వాత దాన్ని రద్దు చేయడం, బదిలీ చేయడం లేదా మరొకరికి అధికారికంగా ఇవ్వడం చట్టబద్ధం కాదు అని స్పష్టం చేసింది. అవార్డు మెడల్ లేదా నగదు బహుమతిని వ్యక్తిగతంగా ఏం చేసినా... నోబెల్ లారియేట్ హోదా మాత్రం ఎప్పటికీ మొదట అవార్డు పొందిన వ్యక్తికే చెందుతుందని తేల్చి చెప్పింది.
చరిత్రలో ఇలా..
అయితే, చరిత్రలో నోబెల్ పురస్కారాన్ని "వదిలేసిన" ఘటనలు లేవా అంటే... ఉన్నాయి. చాలానే ఉన్నాయి. కానీ అవన్నీ గౌరవాన్ని తాకట్టు పెట్టినవి కాదు - చాలా సందర్భాల్లో మానవతా కోణంతో చేసిన నిర్ణయాలే.
2021లో నోబెల్ శాంతి బహుమతి అందుకున్న రష్యా జర్నలిస్టు దిమిత్రి మురటోవ్ తన మెడల్‌ను వేలం వేసి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచారు. ఆ వేలంలో ఆ మెడల్‌కు రికార్డు స్థాయిలో 103.5 మిలియన్ డాలర్లు లభించాయి. ఆ మొత్తాన్ని ఆయన ఒక్క రూపాయి కూడా తన కోసం వినియోగించుకోకుండా... ఉక్రెయిన్ యుద్ధ శరణార్థుల చిన్నారుల కోసం యునిసెఫ్‌కు విరాళంగా అందించారు. ఇది నోబెల్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన వేలంగా నిలిచింది.
అరుదైన ఘట్టం..
అలాగే, 1962లో వైద్యశాస్త్రంలో నోబెల్ అందుకున్న జేమ్స్ డి. వాట్సన్... శాస్త్రీయ పరిశోధనల కోసం నిధులు సమకూర్చేందుకు తన నోబెల్ మెడల్‌ను విక్రయించారు. ఆ మెడల్‌ను రష్యన్ బిలియనీర్ అలిషెర్ ఉస్మనోవ్ కొనుగోలు చేసి... "ఈ అవార్డు శాస్త్రవేత్త దగ్గరే ఉండాలి" అంటూ తిరిగి వాట్సన్‌కే అందజేశారు. ఇది నోబెల్ గౌరవాన్ని కాపాడిన అరుదైన ఘట్టంగా చరిత్రలో నిలిచింది.
ప్రజలకు సాయం కోసం..
ఇక రెండో ప్రపంచ యుద్ధ కాలంలో డెన్మార్క్‌కు చెందిన శాస్త్రవేత్తలు నీల్స్ బోర్, ఆగస్ట్ క్రోగ్... ఫిన్‌లాండ్ ప్రజలకు సాయం చేయాలనే ఉద్దేశంతో తమ నోబెల్ పురస్కారాలను వేలం వేశారు. యుద్ధం ముగిసిన తర్వాత వాటిని మ్యూజియంలకు అందించారు. నీల్స్ బోర్ కుమారుడు ఆగే బోర్ కూడా నోబెల్ విజేతే. ఆయన అవార్డూ వేలానికి వెళ్లింది - కానీ గౌరవం మాత్రం ఎక్కడా తగ్గలేదు.
అత్యంత వివాదస్పదం..
అయితే, ప్రతి ఘటన మానవతా కోణంతోనే జరిగిందా అంటే కాదు. నాజీ భావజాలానికి మద్దతు తెలిపిన నార్వే రచయిత నట్ హామ్సన్... తన నోబెల్ సాహిత్య పురస్కారాన్ని రెండో ప్రపంచ యుద్ధ సమయంలో నాజీ జర్మనీ మంత్రి జోసెఫ్ గోబెల్స్‌కు బహుమతిగా ఇచ్చారు. ఈ ఘటన నోబెల్ చరిత్రలో అత్యంత వివాదాస్పద అధ్యాయంగా నిలిచింది.
ఆ విషయం మాత్రం ఎప్పటికి మారదు
ఇప్పుడు మారియా కొరీనా మచాడో వ్యవహారంలోనూ అదే ప్రశ్న ఎదురవుతోంది. ఇది గౌరవానికి సంకేతమా? లేక రాజకీయ ప్రకటననా?. నోబెల్ కమిటీ స్పష్టంగా చెప్పింది ఒక్కటే.. నోబెల్ ఇవ్వడం, తీసుకోవడం, తిరిగి ఇచ్చేయడం వ్యక్తిగత చర్య కావొచ్చు... కానీ చరిత్రలో ఆ పురస్కారం ఎవరిది అన్నది మాత్రం ఎప్పటికీ మారదు.
అంతిమంగా చెప్పాలంటే నోబెల్ ఒక మెడల్ కాదు... ఒక ఠీవీ. దాన్ని చేతులారా ఇచ్చేయొచ్చు, వేలం వేయొచ్చు, దానం చేయొచ్చు. కానీ ఆ గౌరవాన్ని చరిత్ర నుంచి తొలగించటం మాత్రం ఎవరి వల్లా కాదు.
-
ట్రంప్ సీజ్ ఫైర్ కు నో..! మళ్లీ తీవ్రస్థాయికి ఇరాన్ వార్...! -
ఇరాన్ సుప్రీం లీడర్ గా ట్రంప్ ? అమెరికా అధ్యక్షుడి తాజా షాక్..! -
Trump: నువ్వేగా ఇరాన్ వార్ చేద్దామన్నావ్..! ఆయనపై నెపం నెట్టేసిన ట్రంప్..! -
Donald Trump: పీకల్లోతు కష్టాల్లో ట్రంప్-స్వదేశంలో భారీ షాక్..! -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
చేతులెత్తేసిన ట్రంప్.. ప్రధాని మోదీకి ఫోన్.. -
ఖమేనీ సంధి ఒప్పందం? -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం












Click it and Unblock the Notifications