కెనెడా రాజకీయాల్లో అనూహ్య పరిణామం..ప్రధాని పదవికి ట్రూడో రాజీనామా
కెనెడా రాజకీయాల్లో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. ఆ దేశ ప్రధాని జస్టిన్ ట్రూడో తన పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. అదేవిధంగా లిబరల్ పార్టీ అధ్యక్ష పదవికి కూడా తాను రాజీనామా చేస్తున్నట్టు ట్రూడో తెలిపారు. ప్రధాని పదవి నుంచి ట్రూడో దిగిపోవలని సొంతపార్టీ నేతలు కొంతకాలంగా ధర్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో ట్రూడో.. ప్రధాని పదవితో పాటు, పార్టీ అధ్యక్ష పదవికి ఆయన రాజీనామా చేశారు.

దేశవ్యాప్తంగా ట్రూడోపై ప్రజల్లో వ్యతిరేకత పెరిగిపోవడంతోనే రాజీనామా చేశారని ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. లిబరల్ పార్టీ ఎన్నికల్లో గెలిచే అవకాశాలు లేకపోవడంతోనే ట్రూడో రాజీనామా చేశారని ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి.అయితే కొత్త నాయకత్వాన్ని ఎన్నుకున్న తర్వాత ఈ పదవులకు రాజీనామా చేస్తానని ట్రూడో పేర్కొన్నారు.ఆయన రాజీనామాతో దాదాపు 10 ఏళ్ల అధికారానికి ముగింపు పలికినట్లవుతుంది.












Click it and Unblock the Notifications