వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ట్రంప్ పిచ్చివాడు: చెగువేరా కూతురు ఎలీదా

By Narsimha
|
Google Oneindia TeluguNews

హవానా: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఒక పిచ్చివాడని క్యూబా విప్లవనాయకుడు చెగువేరా కుమార్తె ఎలీదా గువేరా నిప్పులు చెరిగారు. డొనాల్డ్ ట్రంప్‌ పిచ్చితనం వల్ల ప్రపంచం ప్రమాదంలో పడిందని అన్నారు. ట్రంప్‌ చర్యల వల్ల మానవత్వం మంటగలిసే ప్రమాదముందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

57 ఏళ్ల ఎలీదా గువేరా క్యూబా రాజధాని హవానాలో ది వీక్‌ పత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులో ఆమె ట్రంప్‌ వ్యవహర శైలిని తీవ్రంగా విమర్శించారు.'ట్రంప్‌ అనుసరిస్తున్న విధానాలు, అతని వ్యవహార శైలిపై ప్రపంచమంతా స్పందించాల్సిన అవసరముంది.

Che Guevara's daughter fears Donald Trump's 'madness' could destroy humanity

ఎందుకంటే ట్రంప్‌ తనకున్న పిచ్చితనంతో మొత్తం భూగోళాన్నే సమూలంగా నాశనం చేసే ప్రమాదముంది.' ఆమె అన్నారు. ఇప్పటికైనా ప్రపంచదేశాలన్నీ మేల్కోవాలి, సమయం పెద్దగా లేదు.. అందరూ కలిసికట్టుగా ట్రంప్‌ను నిలువరించాలని ప్రపంచానికి ఆమె సూచించారు.

తన వ్యవహరశైలిపై ట్రంప్ ఇప్పటికే పలు మార్లు విమర్శలు ఎదుర్కొన్నారు. ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ వ్యవహరశైలిని నిరసిస్తూ యుద్దమే సరైందంటూ ట్రంప్ దూకుడుగా విమర్శలు ఎక్కుపెట్టిన విషయం తెలిసిందే.

English summary
Legendary Cuban Communist revolutionary Che Guevara's daughter fears that the "madness" of US president Donald Trump could "destroy" humanity.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X