అందుకు సిద్దంగా లేము, ఉ.కొరియాపై ఆంక్షలు ఎత్తేయండి: చైనాతో ఆ వ్యూహానికి తూట్లు?

ఉత్తరకొరియాకు తమ దేశ ఉత్పత్తులను నిలిపేయడం ద్వారా ఆర్థికంగా నష్టపోతున్నామని చైనా గగ్గోలు పెడుతోంది.

బీజింగ్: ఉత్తరకొరియా ఎగుమతులు, దిగుమతులపై ఐరాస ఆంక్షలు విధించడం ద్వారా.. మిత్ర దేశం చైనా నుంచి కూడా దానికి సహాయ సహకారాలు నిలిపివేయించిన సంగతి తెలిసిందే. తత్ఫలితంగా ఐరాస ఊహించినట్లే ఉత్తరకొరియా కూడా దిగిరాక తప్పలేదు.

అప్పటిదాకా గువాంపై దాడి చేస్తామంటూ హెచ్చరికల మీద హెచ్చరికలు జారీ చేస్తూ వచ్చిన ఉత్తరకొరియా.. ఐరాస చర్యతో వెనక్కి తగ్గింది. ఇప్పట్లో దాడి చేసే ఆలోచనలో తమ అధ్యక్షుడు కిమ్ జాంగ్ లేరని కొరియన్ మీడియా ప్రకటించింది. దౌత్య పరంగా ఉత్తరకొరియాను ఏకాకిని చేయడం ద్వారా ఆ దేశ ఆర్థిక మూలాలను, తద్వారా అణు ఆయుధ కొనుగోళ్లను నియంత్రించాలనేది ఐరాస వ్యూహంగా చెప్పవచ్చు.

China denounces U.S. sanctions on North Korea trade

అనుకున్నట్లుగానే ఉత్తరకొరియా ఆ వలలో చిక్కినప్పటికీ.. ఇప్పుడు చైనా నుంచి ప్రతిఘటన ఎదురువుతుండటం ఈ వ్యూహానికి తూట్లు పొడిచేదిగా తయారైంది. ఉత్తరకొరియాలో ఇప్పటికే తాము పెట్టుబడులు పెట్టి ఉన్నందువల్ల.. ఐరాస ఆంక్షలతో తాము తీవ్రంగా నష్టపోతామని వాదిస్తోంది. ఈ విషయంలో అమెరికా కూడా సానుకూలంగా వ్యవహరించాలని కోరుతోంది.

ఉత్తరకొరియాకు ఎగుమతులు నిలిపేయడం వల్ల ఎదురయ్యే ఆర్థిక నష్టాలను భరించడానికి తాము సిద్దంగా లేమని చైనా తేల్చి చెబుతోంది. అయితే చైనా వాదనపై అమెరికా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రే టెల్లర్సన్ మాత్రం తీవ్రంగా మండిపడుతున్నారు. చైనా ఇలా వ్యవహరించడం ఎంతమాత్రం సబబు కాదని ఆయన అభిప్రాయపడ్డారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+