వచ్చే నెలలో ఉత్తరకొరియాకు చైనా అధ్యక్షుడు జిన్ పింగ్..?
గత కొన్ని నెలలుగా చైనా ఉత్తరకొరియా మధ్య సంబంధాలు బలపడుతున్నట్లు కనిపిస్తున్నాయి. ఇప్పటికే చైనాలో మూడు సార్లు పర్యటించి పలు అంశాలపై ఆదేశ అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో చర్చలు జరిపారు ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్. ఇక సింగపూర్ వేదికగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో భేటీ అయ్యేందుకు ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్‌కు చైనా ఓ ప్రత్యేక విమానంను కూడా అందించింది. ఇంత మంచి బంధం ఉన్నందునే ఈ సారి కిమ్ చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ను తమ దేశానికి రావాల్సిందిగా ఆహ్వానించారు.
ఉత్తరకొరియా ఏర్పడి 70 ఏళ్లు అయినందున వచ్చేనెలలో పెద్ద ఎత్తున ఉత్సవాలు జరిపేందుకు కిమ్ ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. ఇందులో భాగంగానే ముఖ్య అతిథిగా ఈ వేడుకల్లో పాల్గొనాల్సిందిగా చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ను కిమ్ జాంగ్ ఉన్ ఆహ్వానించారు. అయితే ఈ ఆహ్వానంపై చైనా విదేశాంగ నుంచి ఎలాంటి అధికార ప్రకటన వెలువడలేదు.

ఒకవేళ జిన్‌పింగ్ ఉత్తరకొరియాకు వెళితే... ఆయన 2012లో అధ్యక్షుడిగా పదవీబాధ్యతలు చేపట్టాకా ఉత్తరకొరియాలో పర్యటించడం ఇదే తొలిసారి అవుతుంది. అంతకుముందు మాజీ అధ్యక్షుడు హు జింటావో 2005లో ఉత్తరకొరియాలో పర్యటించారు. మళ్లీ 13 ఏళ్ల తర్వాత ఓ చైనా అధ్యక్షుడు పర్యటించడం ఇదే తొలిసారి అవుతుంది.
ఉత్తరకొరియా ఆవిర్భావ దినోత్సవ ఉత్సవాలు సెప్టెంబర్ 9న ప్రారంభమవుతాయి. అయితే జిన్‌పింగ్ షెడ్యూల్ ఇంకా ఖరారు కాలేదు కాబట్టి ఏక్షణమైనా ఈ షెడ్యూల్‌లో మార్పు వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం ఉత్తరకొరియాకు ప్రధాన వాణిజ్య మిత్రదేశంగా చైనా ఉంది. ఇప్పటికే కిమ్ జాంగ్ ఉన్న చైనాలో మూడుసార్లు పర్యటించారు.
ఆ సమయంలో ఇరుదేశాల మధ్య పలు అంశాలపై ఇరునేతలు చర్చించారు. ఆర్థిక అంశాలు కూడా ఈ సమావేశంలో చర్చించారు. మరోవైపు ఉత్తరకొరియా అణుపరీక్షలు పూర్తిగా వదిలేయాలని కోరుతూ అగ్రరాజ్యం అమెరికా కిమ్ దేశంపై ఆంక్షలు విధించింది. ఉత్తరకొరియాకు చైనా ఆల్కహాల్, సిగరెట్ ఉత్పత్తులను ఎగుమతి చేస్తుండటంతో ఆ చైనా కంపెనీలపై కూడా ఆంక్షలు విధించింది అమెరికా.
-
జీవన్ రెడ్డికి కేసీఆర్ బిగ్ టాస్క్, ఆపరేషన్ బిగిన్..!! -
భానుడి భగభగలు, పిడుగులతో భారీ వర్షాలు - ఈ ప్రాంతాలకు తాజా హెచ్చరికలు..!! -
Vaibhav Sooryavanshi: బుడ్డోడు మరో వరల్జ్ రికార్డు-కేవలం రెండో బ్యాటర్..! -
'డెకాయిట్'లో అసలైన ట్విస్ట్ ఇదే! -
PM-Rahat: యాక్సిడెంట్ బాధితులకు క్యాష్ లెస్ ట్రీట్మెంట్-ఆస్పత్రులకు ఆదేశాలు..! -
Tamil Nadu polls: చివరి 'బ్రహ్మాస్త్రం' ప్రయోగించిన విజయ్.. ఇక సైకిల్ టూ సీఎం సీటే..! -
Video: ఇదెక్కడి మాస్ రా మావా. బటన్ నొక్కితే బండి నంబర్ ప్లేట్ ఛేంజ్ -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్ -
రేపే రాజ పంచక కాలం ప్రారంభం -
వైభవ్ సూర్యవంశీ RCB పై ఆడిన సునామీ ఇన్నింగ్ దెబ్బకు.. !! -
రోజూ గుప్పెడు గింజలు తినండి.. షుగరు, బీపీ పూర్తిగా కంట్రోల్...!! -
చరిత్ర సృష్టించిన భారత ఆయిల్ ట్యాంకర్ 'జగ్ విక్రమ్'.. 20 వేల టన్నుల LPGతో హార్మూజ్ ను దాటి..











Click it and Unblock the Notifications