చైనాలో సెకెండ్ వేవ్? కరోనా కేసుల విస్ఫోటం: మరో వుహాన్‌లా మారిన బీజింగ్: భయం భయంగా

బీజింగ్: ప్రపంచానికి చావును సరికొత్తగా పరిచయం చేసిన చైనా.. మరోసారి కరోనా వైరస్ బారిన పడింది. ఈ సారి రాజధాని బీజింగ్‌ను చుట్టబెడుతోంది ఈ కరోనా వైరస్. కరోనా సెకెండ్ వేవ్ ప్రారంభమైందనే సంకేతాలను పంపించినట్టు కనిపిస్తోంది. ఇప్పుడిప్పుడే కుదుటపడుతోన్న చైనాలో నెలకొన్న ఈ సెకెండ్ వేవ్ తరహా పరిణామాలు అక్కడి ప్రజలను నిలువెల్లా వణికిస్తున్నాయి. తాజాగా వెలుగు చూసిన కేసులు ఇంకెలాంటి ఉపద్రవానికి దారి తీస్తాయోననే భయాందోళనలకు గురి చేస్తున్నాయి.

ఏప్రిల్ తరువాత తొలిసారిగా..

ఏప్రిల్ తరువాత తొలిసారిగా..

చైనాలో మరోసారి కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. 24 గంటల వ్యవధిలో ఏకంగా 57 కొత్త కేసులు నమోదు అయ్యాయి. ఏప్రిల్‌ తరువాత ఒక్కరోజులో ఈ స్థాయిలో పాజిటివ్ కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. రాజధాని బీజింగ్ దక్షిణ ప్రాంతంలోని అతి పెద్ద మాంసం, కూరగాయల మార్కెట్‌లో కొత్త కేసులు నమోదు అయ్యారు. ఫలితంగా దాన్ని మూసివేశారు. కరోనా పాజిటివ్ పేషెంట్లు నివసిస్తోన్న ప్రాంతాల్లో లాక్‌డౌన్‌ను అమల్లోకి తీసుకొచ్చారు.

విదేశాల నుంచి వచ్చిన వారి ద్వారా..

విదేశాల నుంచి వచ్చిన వారి ద్వారా..

చైనాలో కట్టుదిట్టంగా అమలు చేసిన లాక్‌డౌన్‌ వల్ల దేశీయంగా కరోనా కేసుల పెరుగుదలను నియంత్రించగలిగారు. విదేశాల నుంచి స్వస్థలాలకు చేరుకున్న చైనీయుల వల్ల కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నట్లు గుర్తించామని చైనా నేషనల్ హెల్త్ కమిషన్ ప్రకటించింది. కొత్తగా నమోదైన 57 కేసుల్లో 19 విదేశాల నుంచి వచ్చిన వారి వల్ల సోకినట్లు నిర్దారించింది. 36 కేసులు దేశీయంగా నమోదైనవని పేర్కొంది. రెండు నెలల కాలంలో బీజింగ్‌లో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు కావడం ఇదే మొదటిసారి.

11 ప్రాంతాల్లో లాక్‌డౌన్..

11 ప్రాంతాల్లో లాక్‌డౌన్..

బీజింగ్ దక్షిణ ప్రాంతంలోని మాంసం, కూరగాయల మార్కెట్‌ను దీనికి కేంద్రబిందువుగా గుర్తించారు స్థానిక అధికారులు. ఈ మార్కెట్ చుట్టుపక్కల ఉన్న 11 రెసిడెన్షియల్ క్లస్టర్లలో లాక్‌డౌన్‌ను ప్రవేశపెట్టారు. ఆయా ప్రాంతాల్లోకి బయటి వ్యక్తులెవరినీ అనుమతించట్లేదు. వారికి అవసరమైన నిత్యావసర సరుకులు, పాలు.. ఇతరత్రా వస్తువులను డోర్ డెలివరీ చేస్తు్నారు. దీనికోసం బీజింగ్ స్థానిక అధికారులు ప్రత్యేక ఏర్పాట్లను చేపట్టారు.

మార్కెట్ పరిసరాల్లో కట్టుదిట్టమైన చర్యలు..

మార్కెట్ పరిసరాల్లో కట్టుదిట్టమైన చర్యలు..

కొత్తగా కరోనా వైరస్ వ్యాప్తి చెందడానికి కారణమైన ఈ మార్కెట్ పరిసరాల్లో స్థానిక అధికారులు, పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను చేపట్టారు. ఎటు చూసినా పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్‌మెంట్లను ధరించిన పోలీసులు..స్థానికులను నియంత్రిస్తూ కనిపించారు. లాక్‌డౌన్ అమలు చేస్తోన్న 11 రెసిడెన్షియల్ ఎస్టేట్స్‌లోకి వెళ్లడానికి ప్రయత్నించిన వారిని అదుపులోకి తీసుకున్నారు. లోపలి నుంచి బయటికి ఎవరినీ రానివ్వట్లేదు.

లియానింగ్ ప్రావిన్స్‌లోనూ కొత్త కేసులు

లియానింగ్ ప్రావిన్స్‌లోనూ కొత్త కేసులు

చైనా ఈశాన్య ప్రాంతంలోని లియానింగ్ ప్రావిన్స్‌లో కూడా కొత్తగా రెండు కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయని నేషనల్ హెల్త్ కమిషన్ ప్రకటించింది. బీజింగ్ నుంచి వెళ్లిన వారి వల్ల ఈ కేసులు సోకినట్లు తేలిందని వెల్లడించింది. కొత్తగా కరోనా కేసులు నమోదైన ప్రాంతాలన్నింటినీ కంటైన్‌మెంట్ క్లస్టర్లుగా గుర్తించాలని స్థానిక అధికారులను ఆదేశించినట్లు నేషనల్ హెల్త్ కమిషన్ అధికారులు వెల్లడించారు.

సెకెండ్ వేవ్‌గా

సెకెండ్ వేవ్‌గా

తాజాగా చోటు చేసుకున్న ఈ పరిణామాల పట్ల చైనీయుల్లో భయాందోళనలు వ్యక్తమౌతున్నాయి. విదేశాల నుంచి వచ్చిన వారితో పాటు, వారి కాంటాక్టుల వల్ల కొత్త కేసులు నమోదు అవుతున్నాయని స్థానిక అధికారులు చెబుతున్నారు. దేశీయంగా కొత్త కేసులు పుట్టుకుని రావట్లేదని చెబుతున్నారు. వేల సంఖ్యలో చైనీయులు విదేశాల నుంచి స్వదేశానికి తిరుగుముఖం పట్టడం, వారి కాంటాక్టుల వల్ల కొత్త కేసులు నమోదు కావడం వంటి పరిణామాల వల్ల సెకెండ్ వేవ్ ఆరంభమైందనే అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+