భారత్​ పై చైనా 'వాటర్​ బాంబ్'​.. ఎడారిగా ఆ ఐదు రాష్ట్రాలు..?

భారత్, చైనా సరిహద్దు దేశాలు భారత్ లోని ఐదు రాష్ట్రాలు చైనాతో సరిహద్దును పంచుకుంటున్నాయి. జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరా ఖండ్, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్. అలాగే భారత్, చైనా మధ్య దాదాపు 3,488 కిలోమీటర్ల సరిహద్దు ఉంది. ఈ క్రమంలో చైనా భారత్ పై మరోసారి బిగ్ స్కెచ్ వేసింది. ఈ సారి మిలిటరీతో కాదు నీటితో ఉద్రిక్తతలను పెంచేందుకు సిద్ధమవుతోంది. ఈ విషయాన్ని అరుణాచల్ ప్రదేశ్ సీఎం పెమా ఖాండు ప్రస్తావించారు.

China s Mega Hydropower Dam on Yarlung Tsangpo Arunachal CM Calls It a Water Bomb

భారత్ పై చైనా కుట్ర విషయాన్ని అరుణాచల్ ప్రదేశ్ సీఎం పెమా ఖాండు ప్రస్తావించారు. భారత్ సరిహద్దులోని యార్లాంగ్ సాంగ్ పో నదిపై చైనా అతిపెద్ద హైడ్రో పవర్ ప్రాజెక్ట్ ను నిర్మిస్తోందని తెలిపారు. ఇది భారత్ పై చైనా వాటర్ బాంబ్ గా అభివర్ణించారు. చైనా మిలిటరీ కన్నా ఈ ప్రాజెక్ట్ నిర్మాణం మరింత డేంజర్ అని పెమా ఖాండు వార్నింగ్ ఇచ్చారు.

యార్లాంగ్ సాంగ్ పో నదిపై చైనా నిర్మిస్తూన్న ఈ డ్యామ్ కారణంగా సరిహద్దు రాష్ట్రాలైన జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరా ఖండ్, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ లో నీటి సమస్య పెరిగే అవకాశం ఉందని.. ఈ రాష్ట్రాల్లోని పర్యావరణం, కమ్యూనిటీలకు ప్రమాదం పొంచి ఉందని అరుణాచల్ ప్రదేశ్ సీఎం పెమా ఖాండు తెలిపారు. అరుణాచల్ ప్రదేశ్ లోని గిరిజన జనాభా, జీవనోపాధి మొత్తం దెబ్బతింటుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

చైనా నిర్మించే ఈ డ్యామ్ ప్రపంచంలోనే అతి పెద్ద హైడ్రో పవర్ ప్రాజెక్ట్ గా పేరు గాంచింది. 137 బిలియన్ డాలర్లతో ఈ డ్యామ్ ను నిర్మిస్తోంది. ఈ డ్యామ్ ద్వారా 60,000 మెగా వాట్ల హైడ్రో పవర్ ను ఉత్పత్తి చేయనుంది చైనా. ఈ డ్యామ్ ను భారత్ కు సరిహద్దులో నిర్మిస్తోంది. యార్లాంగ్ సాంగ్ పో నది చైనాను దాటి భారత్ లోకి అడుగుపెట్టగానే బ్రహ్మపుత్ర నదిగా రూపాంతరం చెందుతుంది. మరి చైనా చేపట్టిన ఈ డ్యామ్ నిర్మాణంపై భారత్ ఎలా స్పందిస్తోందో చూడాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+