మూడోకంటికి తెలియకుండా భూకక్ష్యలో చైనా మిస్టరీ ఆబ్జెక్ట్‌: పసిగట్టిన అమెరికా- ఇంతకీ ఏమిటది?

వాషింగ్టన్: అంతరిక్షంపై పట్టు బిగించేలా చైనా కీలక నిర్ణయాలను తీసుకుంటోంది. ఇప్పటికే ప్రత్యేకంగా స్పేస్ స్టేషన్‌ను నిర్మించుకుంటోంది. చైనా స్పేస్ స్టేషన్ రెండు ల్యాబ్ మాడ్యూల్స్ ఇప్పుడు కోర్ మాడ్యూల్‌తో అనుసంధానం అయ్యాయి. స్పేస్ స్టేషన్ టీ- షేప్ కాన్ఫిగరేషన్‌ను రూపొందించింది. తుది నిర్మాణం శరవేగంగా సాగుతోంది. దీని తరువాత చైనా నేషనల్ స్పేస్ ల్యాబ్ అందుబాటులోకి రానుంది.

రహస్యంగా..

రహస్యంగా..

తాజాగా మరో అడుగు ముందుకేసింది. చైనా రహస్యంగా ఓ ఆబ్జెక్ట్‌ను కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. అది ఏమిటనే విషయాన్ని డ్రాగన్ కంట్రీ వెల్లడించట్లేదు. ఈ ఆబ్జెక్ట్‌ను కక్ష్యలో ప్రవేశపెట్టడానికి రీయూజబుల్ స్పేస్‌క్రాఫ్ట్‌ను వినియోగించింది. దీని సహాయంతో ఆ మిస్టరీ ఆబ్జెక్ట్‌ను కక్ష్యలోకి ప్రవేశించింది. చైనా నిర్వహించిన పునర్వినియోగ వ్యోమనౌక రెండవ ప్రయోగం ఇది. గోబీ ఎడారిలోని గ్ఝియుక్వాన్ నుంచి లాంగ్ మార్చ్ 2ఎఫ్ రాకెట్ ద్వారా ఆగస్ట్ 4వ తేదీన ఈ ప్రాజెక్ట్‌ను నిర్వహించింది. 90 రోజుల పాటు కక్ష్యలో ఉంటుంది.

పసిగట్టిన యూఎస్..

పసిగట్టిన యూఎస్..

రెండు వారాల కిందటే ఈ వ్యోమనౌక దాని పెరిజీని పెంచుకుంది. భూమికి దగ్గరగా ఉన్న కక్ష్యలో పాయింట్ నుంచి సుమారు 608 కిలోమీటర్ల దూరం గల వృత్తాకార కక్ష్యలో ఈ మిస్టరీ ఆబ్జెక్ట్‌ను ప్రవేశపెట్టింది. ఈ ప్రయోగాన్ని అమెరికా స్పేస్ ఫోర్స్ పసిగట్టింది. వ్యోమనౌకలో ఓ గుర్తు తెలియని ఆబ్జెక్ట్‌ను లోడ్ చేస్తోన్నట్లు అమెరికా నిర్ధారించింది కూడా. ఈ ఆబ్జెక్ట్ ఏమిటీ? దీని స్వభావం ఎలాంటిది? దీన్ని ప్రవేశపెట్టడానికి గల కారణాలేమిటనే విషయాన్ని చైనా బహిర్గతం చేయట్లేదు.

వారం రోజుల్లో ఎప్పుడైనా..

వారం రోజుల్లో ఎప్పుడైనా..

ఈ వస్తువు మిస్టరీ ఆబ్జెక్ట్‌ను అక్టోబరు 24 నుంచి 31వ తేదీ మధ్యలో ఈ ప్రయోగాన్ని చైనా పూర్తి చేసి ఉండొచ్చని ఆర్బిటల్ ఫోకస్‌కు చెందిన రాబర్ట్ క్రిస్టీ అంచనా వేశారు. అంతరిక్ష నౌకను ప్రయోగించనున్నట్లు చైనా స్పేస్ మిషన్‌ ఎలాంటి ముందస్తు సమాచారాన్ని ఇవ్వలేదు. దీనికి సంబంధించిన ఫొటోలను కూడా బాహ్య ప్రపంచానికి తెలియనివ్వట్లేదు. చైనా వ్యోమ నౌక ఒక వస్తువును అంతరిక్షంలోకి ప్రవేశపెట్టడం ఇదే మొదటిసారి కాదు.

ఎస్ బ్యాండ్ ప్రసారాల్లో..

ఎస్ బ్యాండ్ ప్రసారాల్లో..

2020 సెప్టెంబర్‌లో తన మొదటి మిషన్‌ను చేపట్టింది. అదే నెలలో దాన్ని ముగించింది. ఎస్-బ్యాండ్ ప్రసారాల్లో ఎలాంటి అంతరాయం లేకుండా ఉండటానికి దీన్ని ప్రయోగించినట్లు అప్పట్లో చైనా చెప్పుకొంది. ఇప్పుడు తాజాగా- ప్రయోగించిన ఈ మిస్టరీ ఆబ్జెక్ట్ గురించి ఎలాంటి ప్రకటనా విడుదల చేయలేదు చైనా. ఆ ఆబ్జెక్ట్.. సర్వీస్ మాడ్యూల్ అయి ఉండొచ్చంటూ ఖగోళ శాస్త్రవేత్త, వ్యోమనౌక ట్రాకర్ జోనాథన్ మెక్‌డోవెల్ ఒక ట్వీట్‌లో పేర్కొన్నారు.

ఆగస్టులో..

ఆగస్టులో..

చైనా స్పేస్‌ ప్రాజెక్ట్ గురించి బయటి ప్రపంచానికి పెద్దగా తెలియదు. ఈ స్పేస్‌క్రాఫ్ట్ ఫొటోలు తొలిసారిగా ఆగస్టులో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌పై కనిపించాయి. చైనా అకాడమీ ఆఫ్ లాంచ్ వెహికల్ టెక్నాలజీ- శాస్త్ర, సాంకేతిక, అంతరిక్ష సామర్థ్యాన్ని పెంపొందించుకోవడానికి ఉపయోగపడుతుందంటూ అమెరికన్ మీడియా అంచనా వేస్తోంది. తాజాగా ప్రయోగించిన ఈ స్పేస్ క్రాఫ్ట్ ఎంత కాలం కక్ష్యలో ఉంటుందో తెలియదని పేర్కొంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+