• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఇది చైనా దుర్బుద్ది: డొక్లాంకు ప్రతిగా కశ్మీర్ ముందుకు తెచ్చిన బీజింగ్

By Swetha Basvababu
|

న్యూఢిల్లీ/బీజింగ్: చైనా తన దుర్బుద్ధిని మరోసారి బయట పెట్టుకున్నది. ఆసియా ఖండంలో పెద్దన్న పాత్రను ప్రదర్శించాలని తన తహతహను చైనా బహిర్గతం చేసింది. భారత్ - పాకిస్థాన్ మధ్య వివాదాల్లో తలదూర్చేందుకు సిద్ధమైంది.

కశ్మీర్ వివాదం అంశంలో భారత్, పాకిస్థాన్ మధ్య నిర్మాణాత్మక పాత్ర పోషించాలని భావిస్తున్నట్లు చైనా విదేశాంగశాఖ అధికార ప్రతినిధి గెంగ్ షువాంగ్ పేర్కొనడమే దీనికి నిదర్శనం. ప్రత్యేకించి మన భూభాగంలో సిక్కింలోని సరిహద్దు ప్రాంతం డొక్లాం వద్ద భూటాన్ - భారత్ - చైనా ముక్కోణపు జంక్షన్‌లో తిష్ఠ వేసి భారత్ బంకర్లు ధ్వంసం చేసిన చైనా.. కశ్మీర్ వివాదం పరిష్కారానికి సహకరిస్తానని బ్లాక్ మెయిల్ వ్యూహానికి తెర తీసింది.

సరిహద్దుల్లో వాస్తవాధీన రేఖ వద్ద కశ్మీర్ లో నెలకొన్న పరిస్థితి అంతర్జాతీయ ద్రుష్టిని ఆకర్షించిందని చైనా ఇప్పుడు గమనించిందట. అందుకోసం దాయాది దేశాల మధ్య సఖ్యతకు క్రుషి చేస్తానని ఈ దేశం బీరాలు పోతున్నది. అసలు సంగతేమిటంటే సిక్కింలోని డొక్లాం వద్ద రహదారి నిర్మాణానికి అడ్డు తగులకుండా భారత్ వైదొలిగితే భూటాన్‌ను తమ దారికి తెచ్చుకోవచ్చునని చైనా వ్యూహం. ఈ సంగతి కూడా పరోక్షంగా బీజింగ్ బయట పెట్టింది.

ఎన్ఎస్జీలో ఇలా చైనా మోకాలడ్డు

ఎన్ఎస్జీలో ఇలా చైనా మోకాలడ్డు

అసలు సంగతేమిటంటే భారత్ - పాకిస్థాన్ మధ్య జమ్ముకశ్మీర్ సహా వివాదాస్పదమైన అంశాలన్నింటిపైనా ద్వైపాక్షికంగానే చర్చించుకుని పరిష్కరించుకుంటామని తొలి నుంచి భారత్ చెప్తున్న సంగతి చైనాకు తెలియనిది కాదు. పాక్‌తో వివాదాల పరిష్కారానికి మూడో పక్షం జోక్యానికి తాము అనుమతించబోమని భారత్ అంతర్జాతీయ సమాజానికి ఎప్పుడో తేల్చి చెప్పింది. ఉద్దేశ పూర్వకంగా జమ్ముకశ్మీర్‌లో పాకిస్థాన్ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న సంగతి కూడా తెలుసు. దక్షిణాసియా ప్రాంతంలో భారత్, పాకిస్థాన్ కీలకమైన దేశాలైనందున రెండు దేశాల మధ్య శాంతియుత వాతావరణం ఉండటం మంచిదని సుద్దులు చెప్పేందుకు కూడా బీజింగ్ వెనుకాడుతున్నది. కానీ కశ్మీర్ లోయలో తీవ్రవాద చర్యలకు పాల్పడుతున్న అజహర్ మసూద్ పై ఉగ్రవాద ముద్ర వేయకుండా ఐక్యరాజ్య సమితి భద్రతామండలిలో వీటో చేస్తున్నదీ ఇదే చైనా. అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందం (ఎన్పీటీ)పై సంతకం చేయనందున న్యూక్లియర్ సప్లయర్స్ గ్రూప్ (ఎన్ఎస్జీ)లో భారత్ చేరకుండా మోకాలడ్డుతున్నదీ ఇదే చైనా.

  FB Viral Video: Chinese Man Drinks 3 Litres Of Cool Drink In Just Over 1 Minute | Oneindia Telugu
  డొక్లాంపై ఒత్తిడికే కశ్మీర్ వివాదం ముందుకు ఇలా

  డొక్లాంపై ఒత్తిడికే కశ్మీర్ వివాదం ముందుకు ఇలా

  కానీ భారత్ - పాకిస్థాన్ మధ్య వివాద పరిష్కారానికి చేయూతనిస్తానని నమ్మ బలుకుతున్నది చైనా. చైనా అధికార దినపత్రిక పీపుల్స్ డైలీ అనుబంధ పత్రిక గ్లోబల్ టైమ్స్‌లో జమ్ము కశ్మీర్ అంశం పరిష్కారానికి పాకిస్థాన్ అభ్యర్థిస్తే మూడో పక్ష దేశంగా తమ ఆర్మీ జోక్యం చేసుకుంటుందని చైనా విశ్లేషకుడు వార్తాకథనం రాసిన రెండు రోజులకు ఆ దేశ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి గెంగ్ షువాంగ్.. నిర్మాణాత్మక పాత్ర పోషిస్తామని ధర్మ పన్నాలు చెప్పడంతోనే అసలు కథ అర్థమై పోయింది. డొక్లాం వివాదంలో భారత్ ను ఆత్మరక్షణలో పడవేయడానికే చైనా కశ్మీర్ అంశం ముందుకు తెచ్చిందని భావిస్తున్నారు. అసలు తొలి నుంచి పొరుగు దేశాలంటేనే చైనాకు గిట్టదన్న అభిప్రాయం ఉన్నదంటే అతిశయోక్తి కాదు. అన్ని దేశాలతోనూ అన్ని దేశాలతో శత్రుత్వ ధోరణితో వ్యవహరిస్తుందన్న ఆరోపణలు ఉన్నాయి. దానికి కారణం ఆయా దేశాలపై ఉన్న అపనమ్మకం, ఆధిపత్య ధోరణేనని చెప్తున్నారు.

  ఆర్థిక, సైనిక సంపత్తితో బీజింగ్ బెదిరింపుల వ్యూహం

  ఆర్థిక, సైనిక సంపత్తితో బీజింగ్ బెదిరింపుల వ్యూహం

  ‘తన మన అనే తేడా లేదు. తాననుకునేదే సరిహద్దు. కాదంటే చరిత్ర పాఠాలు చెబుతుంది. మా తాతలు ఇక్కడే తచ్చాడారు.. కాబట్టి ఈ ప్రాంతం అంతా మాదే- అంటుంది. సరిహద్దుల్లో వివాదాలు లేవనెత్తటం, విషప్రచారం చేయటం, ఆక్రమించటం, యథాతథ స్థితి అనటం.. చైనా సామ్రాజ్యవాద విధానంలో కొన్ని ఎత్తుగడలు. చైనా మనతోనే కాక దాదాపు అన్ని సరిహద్దు దేశాలతో గిల్లికజ్జాలు పెట్టుకుంటోంది. అదేమిటంటే తన ఆర్థిక, సైనిక, జన సత్తాను చూపి బెదిరిస్తుంది. చుట్టూ ఉన్నవి చిన్న చిన్న దేశాలు కాబట్టి ఎదురుతిరగలేక మిన్నకుండి పోతున్నాయి. ఇప్పుడు ఇదే ధోరణిని దక్షిణాసియాకు విస్తరించింది. భారత్‌పై ఒంటికాలుపై లేస్తోంది. భారత్‌, భూటాన్‌, చైనా సరిహద్దుల్లో సిక్కిం సెక్టార్‌లోని డోక్లామ్‌ పీఠభూమి ప్రాంతంలో అపరిష్కృతంగా ఉన్న భూవివాదాన్ని తనకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తోంది. భారత్‌ ఎదురుతిరిగి భూటాన్‌కు మద్దతుగా నిలవటాన్ని సహించలేకపోతోంది. చైనాకు మనదేశంతోనే కాకుండా ఇరుగుపొరుగున ఉన్న 18 దేశాలతో సరిహద్దు వివాదాలు ఉన్నాయి. ఆ వివాదాలు సరిహద్దుల విషయంలో, ఇరుగుపొరుగు దేశాలతో సంబంధాల విషయంలో చైనా వైఖరిని ప్రతిబింబిస్తున్నాయి.

  పొరుగు దేశాలతో గిల్లి కజ్జాలు ఇలా

  పొరుగు దేశాలతో గిల్లి కజ్జాలు ఇలా

  మధ్య ఆసియా దేశమైన తజకిస్థాన్‌ క్వింగ్‌ చక్రవర్తుల కాలంలో చైనాలో భాగమని ప్రస్తుత చైనా ప్రభుత్వం వాదిస్తోంది. అదే విధంగా మింగ్‌ చక్రవర్తుల కాలంలో కాంబోడియా చైనాలో కలిసే ఉందని చరిత్ర పాఠాలు తిరగేస్తుంది. యువాన్‌ రాజుల కాలంలో మంగోలియా కూడా చైనాలో భాగమని వాదిస్తుంది. కిర్గిస్థాన్‌ మీద కూడా చైనా కన్ను ఉంది. ఈ దేశాన్ని 19వ శతాబ్దంలో తాము రష్యాకు కోల్పోవలసి వచ్చినట్లు చెబుతుంది. ఇరుగు పొరుగు దేశాలతో వివాదాలను సాధ్యమైనంత మేరకు సామరస్యంగా పరిష్కరించుకోవాలని ఏ దేశమైనా అనుకుంటుంది. కానీ చైనా ఏ దశలోనూ అటువంటి వైఖరిని ప్రదర్శించలేదు. నయానో భయానో పొరుగుదేశాన్ని లొంగదీసుకొని తన వాదనే నెగ్గేటట్లు చేసుకోవాలని భావిస్తూ ఉంటుంది. ఇప్పుడు డోక్లామ్‌ వివాదంలోనూ అదే ధోరణని కనబరుస్తోంది. భూటాన్‌కు తోడుగా భారత్‌ రంగంలోకి దిగుతుందని ­హించలేదు. అందుకే గతాన్ని గుర్తుచేస్తూ బెదిరించే ప్రయత్నం చేస్తోంది. చైనా, ఆఫ్ఘనిస్థాన్ మధ్య ద్వైపాక్షిక ఒప్పందం అమలులో ఉన్నది. కానీ సరిహద్దుల్లో గల ఆఫ్ఘన్ రాష్ట్రం బాదక్షన్‌లోని వాకన్ ప్రాంతాన్ని తన ఆజమాయిషిలోకి తీసుకున్నది.

  పాక్ సాయంతో కశ్మీర్ వద్ద ఇలా తిష్ఠ

  పాక్ సాయంతో కశ్మీర్ వద్ద ఇలా తిష్ఠ

  జమ్ముకశ్మీర్ రాష్ట్రంలోని ఆక్సాయ్ చిన్ నుంచి అరుణాచల్ ప్రదేశ్ వరకు సుదీర్ఘమైన సరిహద్దు ఉంది. ఈ సరిహద్దు ప్రాంతాలను చైనా వివాదాస్పద ప్రాంతాలుగా మార్చేసింది. అక్రమంగా అక్సాయ్ చిన్ ప్రాంతాన్ని ఆక్రమించుకున్నది. ఉత్తర జమ్ముకశ్మీర్ ప్రాంతంలోని శాస్గమ్ లోయను పాకిస్థాన్ ఆక్రమించి.. తర్వాత తన మిత్రదేశం చైనాకు దారాధత్తంచేసింది. పొరుగుదేశాలైన భారత్ - పాకిస్థాన్ మధ్య వివాదాస్పద స్థలంగా ఉన్న ఈ ప్రాంతాన్ని తాను తీసుకోవాలన్న ఇంగితం కూడా చైనాకు లేదు మరి. భారత్ కు చెందిన డెస్సాంగ్ మైదానాన్ని తన ఆజమాయిషీలో పెట్టుకున్న చైనా.. తూర్పున ఉన్న అరుణాచల్ ప్రదేశ్ తన టిబెట్ లో భాగమని బెదిరింపులకు దిగుతుంటుంది. కనీసం తవాంగ్ ను తమకు అప్పగించాలని బేరసారాలు చేస్తూంటుంది. సిక్కిం తనదే అనేది. కానీ సిక్కిం తనకు తానుగా భారత్ లో కలిసింది. ఇలా ప్రతి అంశాన్ని వివాదాస్పదం చేయడం చైనాకు రివాజుగా మారింది.

  భూటాన్‌పై బెదిరింపుల మంత్రం

  భూటాన్‌పై బెదిరింపుల మంత్రం

  నేపాల్‌లోని కొన్ని సరిహద్దు ప్రాంతాలు తమ టిబెట్ లో భాగమని వాదిస్తుంది. దీనికి 1788 - 1792 మధ్య జరిగిన యుద్ధాలను ఉదాహరిస్తూ ఉంటుంది. భూటాన్‌లోని చెర్కివ్ గోంసా, థో, దుంగమర్, గేసుర్, గెజాన్. ఖోచర్, కులా కాంగ్రి కొండలు, పశ్చిమ హ జిల్లాలు తమవేనని బెదిరింపులకు దిగుతూ ఉంటుంది. డొక్లాం పీఠభూమిని వివాదాస్పద ప్రాంతమని గతంలోనే అంగీకరించిన చైనా.. తాజాగా ఇది తమ ఆధీనంలోని ప్రాంతమని ఏకపక్షంగా కలిపేసుకునేందుకు ప్రయత్నిస్తున్నది. ఫిలిఫ్పీన్స్, వియత్నాం, ఉత్తరకొరియా, దక్షిణ కొరియా, తైవాన్, జపాన్ తదితర దేశాలతోనూ ఇటువంటి వివాదాలే ఉన్నాయంటే ఆశ్చర్యమేమీ లేదు.

  తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  China has said that it is willing to play a "constructive role" in improving relations between India and Pakistan, especially after the increased hostility along the Line of Control, saying the situation in Kashmir has attracted "international" attention. Chinese foreign ministry spokesman Geng Shuang said India and Pakistan are important South Asian countries but the "situation in Kashmir has attracted the attention of the international community."
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more