Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Viral Video: అది రైలా..? మెరుపుతీగా..? 2 సెకన్లలో 700 కి.మీ వేగం..!

చైనా సాంకేతికత గురించి ఎంత చెప్పినా తక్కువే. అత్యాధునిక టెక్నాలజీని క్షణాల్లో అందిపుచ్చుకోవడంలో చైనా ముందుంటుంది. అయితే రైల్వే చరిత్రలో చైనా నూతన అధ్యాయాన్ని లిఖించింది. ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన స్పీడ్ ను అందుకుని నయా రికార్డును నెలకొల్పింది. మాగ్నెటిక్ లెవిటేషన్ అనే సరికొత్త టెక్నాలజీతో నడిచే మాగ్లెవ్‌ రైలును పరీక్షించింది. ఈ క్రమంలో కేవలం 2 సెకన్లలోనే 700kmph వేగం అందుకుని వరల్డ్ రికార్డు క్రియేట్ చేసింది. మరో ప్రయోగంలో గంటకు 800 కి. మీ వేగంతో దూసుకెళ్లింది.

ప్రపంచంలోని అనేక రికార్డుడ్ని చైనా తన ఖాతాలో వేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పటివరకూ ట్రైన్ వ్యవస్థలో జపాన్ ముందంజలో ఉండగా.. తాజాగా చైనా ఆ దేశాన్ని దాటి ముందుకు వచ్చింది. రైల్వే లోనూ తనదే పై చేయి అన్నట్లుగా చైనా ప్రపంచ రికార్డు నెలకొల్పింది. సరికొత్త మాగ్లెవ్ టెక్నాలజీలో చైనా ఈ ప్రపంచ రికార్డును చేరుకుంది.

ఈ మేరకు జపాన్ పేరిట ఉన్న పాత రికార్డులను చైనా అధిగమించింది. తాజాగా చైనా మాగ్లెవ్ రైలు కేవలం 2 సెకన్లలోనే 700kmph వేగం అందుకుని వరల్డ్ రికార్డు క్రియేట్ చేసింది. అయస్కాంత శక్తితో పట్టాల మీద గాలిలో తేలుతూ వెళ్లే ఈ రైలు టన్ను బరువు ఉంటుంది. 400 మీటర్ల మీద దీన్ని టెస్ట్ చేశారు. ఈ టెస్టుతో అత్యంత వేగవంతమైన సూపర్‌ కండక్టింగ్‌ ఎలక్ట్రిక్‌ మాగ్లె వ్‌ రైలుగా ఇది నిలిచింది. రైలు ట్రయల్‌ రన్స్‌ కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది. అలాగే ఈ టెక్నాలజీతో ఫ్యూచర్ లో రాకెట్లు, విమానాల టేకాఫ్ వేగాన్నీ పెంచొచ్చని అధికారులు చెబుతున్నారు.

చైనా నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ డిఫెన్స్ టెక్నాలజీ (NUDT) పరిశోధకులు సరికొత్త మాగ్లెవ్ టెక్నాలజీని రూపొందించి ఈ టెస్టు నిర్వహించారు. ఈ మాగ్లేవ్ రైలును 400 మీటర్ల పొడవైన ట్రాక్ పై టెస్టింగ్ చేశారు. ఈ క్రమంలో రైలు కేవలం రెండు సెకన్లలోనే గంటకు 700 కి. మీ. వేగాన్ని అందుకుని అందరినీ ఆశ్చర్య పరిచింది. ఆ తర్వాత రైలును అధికారులు సురక్షితంగా ఆపగలిగారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.

China Shatters World Record Maglev Hits 700 km h in Just 2 Seconds

ఇక భారత్ లో ప్రస్తుతం నమో భారత్ రైలు (దిల్లీ నుంచి మీరట్ RRTS) గంటకు 160 కి. మీ వేగంతో అత్యంత వేగంగా నడుస్తున్న రైలుగా నిలిచింది. ఈ రైలు వందే భారత్ ఎక్స్‌ ప్రెస్ అలాగే గతిమాన్ ఎక్స్‌ ప్రెస్ కంటే ఎక్కువ వేగాన్ని సాధించడం విశేషం.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+