మే ఐ కమిన్: యుద్ధంలోకి డ్రాగన్ ఎంట్రీ.. ఇప్పుడే అసలు మజా..??
పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు ఏమాత్రం తగ్గడం లేదు. పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్ వేదికగా ఇరాన్- అమెరికా మధ్య జరిగిన చర్చలు విఫలం అయిన విషయం తెలిసిందే. దాంతో ఇరు దేశాల మధ్య మరోసారి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇప్పటికే హార్మూజ్ జలసంధిని దిగ్బంధనం చేస్తామని హెచ్చరించిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఈ మేరకు అమెరికా నేవీ సైన్యానికి ఆదేశాలు జారీ చేశారు.
ఇక మరోవైపు ఇరాన్- అమెరికా మధ్య రెండోసారి చర్చలు జరిపేందుకు ప్రణాళికలు సిద్ధం అవుతున్నట్లు స్పష్టం అవుతోంది. ఇరాన్- అమెరికా మధ్య పాకిస్థాన్ లేదా స్విట్జర్లాండ్ వేదికగా మరోసారి ఉన్నత స్థాయి చర్చలు జరిగే అవకాశం ఉందని సమాచారం. మరోవైపు రెండో విడత చర్చలు పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్‌లోనే జరిగే అవకాశముందని అమెరికా మీడియా నివేదికలు వివరిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో ఇప్పుడీ రణరంగంలోకి చైనా వచ్చింది. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలను తగ్గించి శాంతిని నెలకొల్పేందుకు చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ నాలుగు అంశాలను ముందుకు తీసుకొచ్చారు. ఈ విషయాల్ని బీజింగ్ లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నేత షేక్ ఖలీద్ బిన్ మహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ తో జరిగిన కీలక సమావేశంలో ఆయన వెల్లడించారు.
జిన్ పింగ్ వివరించిన విషయాలు చూస్తే.. శాంతియుతంగా సహజీవనంగా ఉండటం.. అంటే పశ్చిమాసియా, గల్ఫ్ దేశాల్లో ఒక సుస్థిరమైన భద్రతా వ్యవస్థను నిర్మించాలని చైనా పిలుపునిచ్చింది. దేశాల మధ్య శత్రుత్వాన్ని తగ్గించే విధంగా సహకారాన్ని పెంచాలని సూచనలు చేసింది. అలాగే రెండో అంశంగా జాతీయ సార్వభౌమాధికారం.. అనగా ఆయా దేశాల అంతర్గత వ్యవహారాల్లో ఇతరులు జోక్యం చేసుకోకూడదని స్పష్టం చేసింది.

ఇక మూడో అంశంగా అభివృద్ధితో భద్రత అని పేర్కొంది. అంటే ఆర్థిక పురోగతి ఉంటేనే శాంతిని నెలకొల్పడం సులభం అని చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ పేర్కొన్నారు. ఇక చివరి అంశంగా అంతర్జాతీయ చట్టాలు, నిబంధనలను తమకు నచ్చినట్లుగా అనుకూలంగా వాడుకోవడం సరికాదని స్పష్టం చేసింది. ఇక ఇరాన్- ఇజ్రాయెల్- అమెరికా మధ్య గత 40 రోజులకుపైగా యుద్ధం జరుగుతున్న విషయం తెలిసిందే..
-
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
ట్రంప్‌కు భారీ షాక్! ఇరాన్ విషయంలో అంతర్జాతీయ ట్విస్ట్!! -
Trump vs Pope: ట్రంప్ కు పోప్ లియో ఘాటు కౌంటర్-ఇరాన్ వార్ పై మరో షాక్..! -
అమెరికా అన్నంత పనీ చేసిందీ.. ట్రంప్ చేతుల్లోకి హార్మూజ్ జలసంధి..? -
Trump Calls PM Modi: మోడీకి ట్రంప్ ఫోన్ కాల్-హార్ముజ్ పై కీలక చర్చలు..! -
యుద్ధంలోకి అమెరికా నేవీ.. హార్మూజ్ జలసంధి అష్టదిగ్బంధనం.. ట్రంప్ సంచలన వార్నింగ్ -
US- Iran War : మళ్లీ మొదలైన వార్..! హార్ముజ్ లో అమెరికా-గల్ఫ్ పై ఇరాన్..! -
కిలో బియ్యం రూ.600 - రూ.800.. కేజీ మాంసం రూ. 4000 పైనే !!! -
అమెరికా సైన్యాన్ని హార్మూజ్ సుడిగుండాల్లో కప్పెట్టేస్తాం: ఇరాన్ సంచలన వార్నింగ్ -
Hormuz Showdown: హార్ముజ్ లోనే తాడోపేడో..! అమెరికా-ఇరాన్ లో గెలిచేదెవరు ? -
ఇరాన్ నష్టం రోజుకు రూ. 4,000 కోట్లు పైమాటే










Click it and Unblock the Notifications