ఆ సెక్సీ భామలతో స్వర్గసుఖాలు: రూ.18కోట్లు పోగొట్టుకున్నాడు

Subscribe to Oneindia Telugu

బీజింగ్: పుర్రెకో బుద్ధి జిహ్వకో రుచి అన్నట్లుగా చైనాకు చెందిన ఓ వ్యాపారవేత్త హాలీవుడ్ హీరోయిన్లతోపాటు చైనా సెక్సీ మోడళ్లతో గడిపేందుకు కోట్ల రూపాయలు తగలేశాడు. ఆ తర్వాత అతనితో ఒప్పం చేసుకున్న సంస్థ మోసం చేసిందని దావా వేసేందుకు సిద్ధమయ్యాడు.

వివరాల్లోకి వెళితే.. జు యూ అనే వ్యాపారవేత్త హాలీవుడ్ తారలైన మెగాన్ ఫాక్స్, విక్టోరియా సీక్రెట్ మోల్ కాండీస్ స్వానెపోల్, చైనా ప్రముఖ మోడల్ ఇంగ్ ఇంగ్ తదితరులతో ఎంజాయ్ చేయాలనుకున్నాడు. ఇందుకోసం రూ. 18కోట్లు (హెచ్‌కె21.5మిలియన్ డార్లు) చెల్లించాడు. అయితే అతని కోరిక మాత్రం తీరలేదు.

megan

దీంతో తనతో ఈ మేరకు ఒప్పందం కుదుర్చుకుని మోసం చేసిన ఆస్ట్రేలియాకు చెందిన రాయల్ కోర్ట్ ఎస్కార్ట్ ఏజెన్సీ మీద కేసు పెట్టేందుకు సిద్ధమయ్యాడు జు యూ. తను ఆరాధించే తారలు చైనా వస్తారని ఎదురుచూశానని, వాళ్లెవరూ రాలేదని వాపోయాడు.

ఆ ఎస్కార్ట్ కంపెనీ మీద దావా వేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపాడు. ఏజెన్సీ వారు చెప్పినట్లుగానే తాను మొత్తం డబ్బు చెల్లించానని, కానీ తనకు మాత్రం స్వర్గసుఖాలు అందించేందుకు ఎవరూ రాలేదని ఆవేదన వ్యక్తం చేశాడు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A Chinese businessman is suing an Australian escort agency for failing to provide him with “sexual services” from Hollywood A-listers and mainland Chinese celebrities.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి