మగ బిడ్డ కోసం 20 ఏళ్లుగా నిరీక్షణ..?.. 9 సార్లు ఆడ సంతానమే..చివరికి..
సాధారణంగా దంపతులు..తమకు పుట్టేది మగ బిడ్డ అయినా ఆడ బిడ్డ అయినా దేవుడి ప్రసాదంగా భావిస్తారు. కొందరు తమకు ఆడ బిడ్డ మాత్రమే పుట్టాలని కోరుకుంటారు. మరికొందరు తమకు మగ బిడ్డను ప్రసాదించాలని దేవుడ్ని వేడుకుంటారు. అయితే ఓ జంట మాత్రం మగబిడ్డ కోసం ఏళ్లుగా నిరీక్షించింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 9 సార్లు ఆమె గర్భం దాల్చింది.. 9 సార్లూ ఆడ సంతానమే వారికి కలిగింది. ఆమె గర్భం దాల్చిన ప్రతి సారీ మగ బిడ్డ పుడుతుందన్న ఆశ మాత్రం అలాగే ఉంది. ఇప్పుడు ఆ జంట వయసు 80 ఏళ్లకు పైమాటే. ఈ ఆసక్తికర సంఘటన చైనాలో జరిగింది.
ఈస్ట్రెన్ చైనాకు చెందిన ఈ దంపతులు ప్రస్తుతం జియాంగ్సూ ప్రావిన్స్ లోని హువాయిన్ అనే గ్రామంలో నివసిస్తున్నారు. సాధారణంగా చైనా లోని అనేక గ్రామాల్లోని ప్రజలు మగ బిడ్డను కనడానికే ఇష్టపడుతున్నారు. దీంతో ఈ దంపతులు కూడా మగ బిడ్డ కోసం ఏళ్లుగా నిరీక్షించారు. ఈ క్రమంలో వారికి 9 మంది ఆడ పిల్లలు పుట్టారు. 9 మందికీ "బ్రదర్(సోదరుడు)" అనే అర్థం వచ్చేలా పేర్లు పెట్టింది ఆ జంట.

ప్రస్తుతం ఆ కుటుంబంలోని మొదటి కుమార్తెకు చిట్టచివరి కుమార్తెకు 20 ఏళ్ల గ్యాప్ ఉంది. అంటే ఆ దంపతులు మగ బిడ్డ కోసం దాదాపు 20 ఏళ్లుగా నిరీక్షణ చేస్తున్నట్లుగా భావించవచ్చు. చైనాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ కథనం ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. ఈ విషయంపై ఓ కుమార్తె జియాంగ్దీ స్పందించారు.
" మా నాన్నకు మగ బిడ్డపై చాలా ప్రేమ ఉండేది. అందుకే మేము 9 మంది ఆడ పిల్లలం జన్మించాం. మేము కుమార్తెలమైనా..మా తల్లిదండ్రులు మిమ్మల్ని ప్రేమతో పెంచారు. ఇప్పుడు మా బిగ్ ఫ్యామిలీ సంతోషంగా ఉంది" అని జియాంగ్దీ చెప్పుకొచ్చారు. తమ తండ్రి పేద రైతు అయినా.. తమను ప్రేమగా పెంచారని.. విద్య అందించారని వివరించారు. వారి జీవన విధానంపై జియాంగ్దీ ఎప్పటికప్పుడు ఇన్ స్టా లో వీడియోలు పోస్ట్ చేస్తూ ఉండేది. దీంతో వీరి కథనాలు ఒక్కసారిగా వైరల్ అయ్యాయి. ఈ కథనంపై నెటిజెన్లు ఫన్నీగా.. ఆసక్తి కరంగా కామెంట్స్ చేస్తున్నారు.
అయితే ఈ దంపతుల్లాగానే చైనాలో అనేక మంది జంటలు తమకు మగ బిడ్డే కావాలని కోరుకుంటున్నారు. మగ బిడ్డ అయితే తమను వృద్ధాప్యంలో చూస్తారని ఆశిస్తున్నారు.
-
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!!












Click it and Unblock the Notifications